Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్.. స్టార్ క్రికెటర్ గుట్టురట్టు చేసిందే..!!

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఊసరవెల్లి సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది నటి పాయల్ ఘోష్.. ఆ తర్వాత బాలయ్య తో కలిసి కూడా ఒక సినిమాలో నటించింది. ఇవేవీ పెద్దగా కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించడం జరిగింది. కానీ బాలీవుడ్లో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందని ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై పలు రకాల వ్యాఖ్యలు చేయడం పెను దుమారాన్ని రేపింది.

అయితే ఇప్పుడు మరొకసారి ప్రముఖ టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గౌతమ్ గంభీర్ పైన షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ విషయం తెలిసి పలువురు నెటిజెన్స్ గౌతమ్ గంభీర్ ఇన్ని కథలు పడ్డాడా… అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి విషయాలైనా సరే పాయల్ ఘోష్ ముక్కు సూటిగానే చెప్పేస్తూ ఉంటుంది. తనకు జరిగిన అన్యాయాలను సైతం తెలియజేస్తూ ఎప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇప్పుడు తాజాగా టీం ఇండియ మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయం కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది. 2011లో పాయల్ ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో ఈమె రిలేషన్ లో ఉండేదట. అలా దాదాపుగా ఐదేళ్లపాటు వీరిద్దరూ కలిసి తిరిగారని ఆ సమయంలోనే పాయల్ కు మరొక క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఎక్కువగా మిస్డ్ కాల్స్ ఇచ్చే వారని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది.

- Advertisement -

తాను 2011 నుంచి ఐదేళ్లపాటు ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ చేశానని తెలియజేసింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగిందని ఆ సమయంలోనే గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్ కూడా నేనంటే ఇష్టపడే వారని కానీ ఇర్ఫాన్ పఠాన్ ని మాత్రమే తాను ఇష్టపడ్డాను అని తెలియజేసింది. అతను తప్ప మరెవరిని కూడా ప్రేమించలేదని కూడా తెలియజేసింది. తాను ఇర్ఫాన్ కి గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్ వివరాలను కూడా చూపించానని, ఈ ఇర్ఫాన్ పఠాన్… తన ఫోన్ కాల్స్ ఎప్పుడు పరిశీలిస్తూ ఉండేవారని.. ఒక మ్యాచ్ కోసం ఇర్ఫాన్ పూణేలో ఉన్నప్పుడు అతనిని కలిశానని ఆ సమయంలో తన సోదరుడు యూసఫ్ ఫటాన్ ,హార్దిక్, కుర్నాల్ పాండే ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారని వివరించింది. కానీ గంభీర్ ఎప్పుడు కూడా తనతో తప్పుగా ప్రవర్తించలేదు.. అందుకే ఆయనను ఎప్పుడూ కూడా గౌరవిస్తానంటూ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify-

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు