Avika gor: ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన అవికాగోర్..!

ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కంటే చైల్డ్ ఆర్టిస్ట్ గానే భారీ పాపులారిటీ దక్కించుకుంది. బాలనటిగా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె “బాలికా వధు” అనే సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ హిందీ నుంచి పలు భాషల్లోకి అనువాదం కాగా.. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో ఆనంది గా అవికా గోర్ నటన తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా కట్టిపడేసింది. పిల్లలు, పెద్దలు అంటూ వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఆనంది పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇప్పటికీ కూడా అవికా గోర్ కనిపించింది అంటే చిన్నారి పెళ్లికూతురులోని ఆనంది కదా అంటూ చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎలా అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అందుకే తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా తొలి ప్రయత్నం మొదలు పెట్టింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఈమెకు హీరోయిన్ గా సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి. ఒకవైపు సినిమాలలోనే కాకుండా ఓటిటి ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న ఈమె తాజాగా నటించిన వధువు వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందు, అలీ రెజా తో కలిసి ఇందులో అవిక నటించారు

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ని పోలూరు కృష్ణ దర్శకత్వం వహించగా .. ఎస్వీఎఫ్ బ్యానర్ పై శ్రీకాంత్ మోహ్త, మహేంద్ర సోనీ నిర్మించారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన ఈమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవికా గోర్ మాట్లాడుతూ.. “చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చేసేటప్పుడు నా వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే.. అప్పుడు పెళ్లంటే ఏంటో కూడా తెలియదు.. పెళ్లికూతురు ఎలా ఉండాలి.. ఇంట్లో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు.. సందేహాలు వస్తే డైరెక్టర్ని అడిగేదాన్ని.. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది పడలేదు” అంటూ తెలిపింది.

- Advertisement -

ఇకపోతే ఆన్ స్క్రీన్ పై ఇప్పటివరకు 20 సార్లు తాను పెళ్లి చేసుకుని ఉంటానని నవ్వుతూ వెల్లడించింది. ఇన్నిసార్లు పెళ్లికూతురు కావడం తనకు బోర్ కొట్టలేదని , పెళ్లికూతురు లా చీర కట్టుకొని, హెయిర్ స్టైల్ చేసుకొని మేకప్ చేసుకోవడం అంటే తనకు చాలా ఇష్టమని.. చిన్నారి పెళ్లికూతురు నుంచి వధువు వెబ్ సిరీస్ వరకు ఎన్నో సందర్భాలలో ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగిందని.. వధువులో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లి సీన్ చేస్తున్నప్పుడు ఈ వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లికూతురు అయ్యా అనిపించింది అంటూ తెలిపింది. మొత్తానికి అయితే చిన్నారి పెళ్ళికూతురుకి, వధువుకి మధ్య తేడా చాలా ఉంది అంటూ తెలిపింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు