Hi Nanna: ఆరోజు రాత్రి కల్లా ఉందా ఊడిందా.. మీకు తెలిసిపోతుంది..! – నాని

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో ‘హాయ్ నాన్న’ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో హేశం అబ్దుల్లా మెలోడీ ట్యూన్స్ తో, లవ్లీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా రెండు వారాల కిందే మొదలైపోగా, నాని కూడా ప్రెస్ మీట్లు పెడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. రీసెంట్ గా బిగ్ బాస్ షో కి కూడా వెళ్లి ప్రమోట్ చేసిన నాని తాజాగా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయడం మొదలెట్టాడు. ఈ ప్రాసెస్ లో ఒక అభిమాని సినిమా ప్రీమియర్స్ పై మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయంటున్నారు అది నిజమేనా? టాక్ ఏంటి? అని నాని ని అడిగాడు.

దీనికి నాని తన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. నాని ట్విట్టర్ లో స్పందిస్తూ పెయిడ్ ప్రీమియర్స్ లేవు, AMB లో 6th ఈవెనింగ్ కొన్ని షోస్ మీడియా వారికి, ప్రత్యేకంగా సెలెక్ట్ చేయబడ్డ ఆడియన్స్ కి వేస్తున్నారు. ఆరోజు అంటే 6th రాత్రి కల్లా సినిమా ఉందా ఊడిందా మీకు తెలిసిపోతుంది.
నా వరకు హాయ్ నాన్న ఉండిపోతుంది ఎప్పటికీ అని నా feeling అని నాని రిప్లై ఇచ్చాడు.

- Advertisement -

ఈ ట్వీట్ పై నాని ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉంటూ ప్రైస్ చేస్తుంటే, ట్రేడ్ విమర్శకులు అతి నమ్మకం పనికిరాదంటున్నారు. ఏది ఏమైనా ఫుల్ పాజిటివ్ హైప్ ఉన్న హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న మంచి టాక్ తెచ్చుకోవడం గ్యారెంటీ అని కామన్ ఆడియన్స్ భావిస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు