Biggboss elimination: అది జరగకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడు – నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాక సోషల్ మీడియా లో తనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని, వోటింగ్ ప్రకారం ఎలిమినేట్ కాలేదని, స్టార్ మా బ్యాచ్ ని కాపాడడానికి కావాలని ఎలిమినేట్ చేసారని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

ఆడియన్స్ కూడా ఈ వారం చాలా వరకు శోభా శెట్టి లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. అయితే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ షో లో నిజానికి ఎలిమినేట్ కావాల్సిన వారు వేరే వ్యక్తి అని చెప్పాడు. అతనెవరో కాదు అంబటి అర్జున్. అవును.. బిగ్ బాస్ లో లాస్ట్ వీక్ ఫినాలే అస్త్ర గెలిచి నేరుగా ఫైనల్స్ కి చేరుకున్నాడు.

అయితే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్న అర్జున్ వోటింగ్ పరంగా అందరికంటే తక్కువలో ఉన్నాడని, టాస్క్ గెలవడం వల్ల నేరుగా ఫైనల్స్ కి వెళ్లాడని కాబట్టి, అలా తన ఆటతో సేవ్ అయ్యాడని చెప్పాడు. అయితే మిగతా హౌస్ మేట్స్ ని కూడా హెచ్చరిస్తూ, ఇకనైనా గ్రూప్ గా కాకుండా తమ గేమ్ పై దృష్టి పెట్టండని అనడం జరిగింది.

- Advertisement -

అయితే నాగార్జున చెప్పినట్టు అంబటి అర్జున్ కి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయం ఎంత నిజమో, ఆ తర్వాతి ప్లేస్ లో శోభా శెట్టి ఉన్న విషయం కూడా అంతే నిజమని ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వారమైనా కరెక్ట్ పర్సన్ ని ఎలిమినేట్ చేయమని ఆడియన్స్ అంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు