Celebrities Breakup: నిశ్చితార్థం చేసుకొని విడిపోయిన జంటలు ఇవే..!

సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమించుకుంటారో తెలియదు.. ఎప్పుడు వివాహం చేసుకుంటారో తెలియదు.. అలా అని ఎప్పుడు విడిపోతారో కూడా తెలియని సందర్భాలు ఏర్పడ్డాయి. ఈమధ్య కాలంలో చాలా మంది ప్రేమించుకోవడం , నిశ్చితార్థం చేసుకోవడం ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోవడం లాంటివి మరింత ఎక్కువగా మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకొని నిశ్చితార్థం కూడా చేసుకొని.. ఆ తర్వాత తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. మరి ప్రేమించుకుని నిశ్చితార్థం జరుపుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయిన జంటల గురించి ఇప్పుడు చూద్దాం.

రక్షిత్ శెట్టి – రష్మిక :
కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి , రష్మిక ఇద్దరు కూడా కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా 2018 లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత రష్మికకు సినిమా అవకాశాలు రావడంతో.. నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకొని కెరియర్ పరంగా ఇద్దరూ సినిమాలలో బిజీ అయిపోయారు.

అఖిల్ – శ్రీయ భూపాల్:
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈయన ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి మరి 2016 లో నిశ్చితార్థం చేసుకున్నారు. సమంత , నాగచైతన్య , అఖిల్, శ్రియ భూపాల్ నిశ్చితార్థపు వేడుకలు ఒకేసారి జరిగాయి. తర్వాత కొంతకాలానికి అఖిల్ , శ్రీయ భూపాల్ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. శ్రియా భూపాల్ మాత్రం వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా.. అఖిల్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు.

- Advertisement -

త్రిష – వరుణ్ మ్యానియన్:
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ప్రకటించిన ఈ జంట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి.. అందరికీ షాక్ ఇచ్చారు.

విశాల్ – అనీషా రెడ్డి:
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హైదరాబాద్ కి చెందిన అనీషా రెడ్డి అనే అమ్మాయిని 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు పెళ్లి డేట్ ప్రకటించకుండానే నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు