Winter Make Up Tips : ఈ సీజన్లో మేకప్ వేసుకుంటున్నారా? ఈ టిప్స్ తో మరింత అందం మీ సొంతం

వింటర్ సీజన్ లో చర్మం ఎక్కువగా పొడి బారుతూ, నిర్జీవంగా కనిపిస్తుంది. స్కిన్ డల్ గా కనిపించడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సాధారణంగా చలి కాలంలో స్పెషల్ స్కిన్ కేర్ తప్పనిసరి. మీ స్కిన్ ఏ రకమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మాయిశ్చరైజర్, సన్ స్క్రిన్ వాడితే చాలు. ఫేస్ నిగనిగలాడిపోతూ ఆకర్షణీయంగా కన్పిస్తుంది. మరి వింటర్ సీజన్ లో  ఏదైనా పార్టీకి లేదా ఫంక్షన్ కు వెళ్లాల్సి వస్తే…

పార్టీ అంటే సీజన్ ఏదైనా మేకప్ మాత్రం తప్పనిసరి. అయితే వింటర్ లో మేకప్ వేసుకుంటే స్కిన్ డ్రైగా ఉండడం వల్ల అది ఎబ్బెట్టుగా కనిపించే అవకాశం ఉంది. మేకప్ పై పెద్దగా అవగాహన లేని వారికి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న అమ్మాయిలు మేకప్ వేసుకుంటే చలికాలంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వింటర్ లో కూడా అద్భుతమైన లుక్ తో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. మరి ఆ మేకప్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో మేకప్ వేసుకోవాలనుకునేవారు మేకప్ వేసుకోవడానికి ముందే మంచి మాయిశ్చరైసర్ రాసుకుని చర్మంపై మసాజ్ చేయండి. అయితే మసాజ్ అనగానే చర్మాన్ని బాగా రుద్దకుండా, తేలికపాటి మసాజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. కనీసం రెండు నిమిషాల పాటు చర్మాన్ని మసాజ్ చేయండి. అప్పుడే మేకప్ వేసుకున్నా కూడా మీ చర్మం మృదువుగా కనిపిస్తుంది. నిజానికి మసాజ్ వల్ల ముఖంపై రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో మేకప్ కూడా సులభంగా సెట్ అవుతుంది.

- Advertisement -

శీతాకాలంలో మేకప్ వేసుకున్నప్పుడు అదిరిపోయే లుక్ కావాలి అని అనుకుంటే మెరిసే మేకప్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించండి. చాలామంది మ్యాట్ మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే దీనివల్ల ముఖం డ్రైగా కనిపిస్తుంది. కానీ క్లాసి బేస్ తో కూడిన మేకప్ ప్రొడక్ట్స్ వాడితే మీరు తప్పకుండా అట్రాక్టివ్ గా కనబడతారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.

ఇక చలికాలంలో ఎక్కువగా లిక్విడ్, క్రీమీ బేస్ ఉన్న క్రీమ్ లు, ఫౌండేషన్ లో మాత్రమే కొనుక్కోవాలని గుర్తుపెట్టుకోండి. మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ లో రెండు చుక్కల ఫేస్ ఆయిల్ ని కలపండి. ఆ తర్వాత నెమ్మదిగా చేతులతో ముఖంపై ఫౌండేషన్ ను  అప్లై చేయండి. అయితే తేలికపాటి మేకప్ మాత్రమే వేసుకోవాలి అని గుర్తుంచుకోండి. ఫౌండేషన్ అప్లై చేశాక లిక్విడ్ హైలైటర్ ని ఉపయోగించండి. దీంతో మీ మేకప్ లుక్ సహజంగా, అద్భుతంగా కనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు