Thandel : మహానటి రిజెక్ట్ చేసిన కథకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. మహానటి కీర్తి సురేష్ రిజెక్ట్ చేస్తేనే ఆ పాత్ర సాయి పల్లవి వద్దకు చేరిందా?

మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగచైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో లవ్ స్టోరీ మూవీతో మ్యాజిక్ చేసిన చైతు సాయి పల్లవి జంట మరోసారి రిపీట్ కాబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీకి ఫుల్ హైప్ వచ్చింది. అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే మూవీ పై అంచనాలు ఈ రేంజ్ లో పెరగడానికి హీరోయిన్ సాయి పల్లవి కూడా ఓ మెయిన్ రీజన్. ఈ నేపథ్యంలోనే తాజాగా తండేల్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఫిలిం వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకోలేదట మేకర్స్. మరో హీరోయిన్ రిజెక్ట్ చేస్తేనే ఈ కథ సాయి పల్లవి దగ్గరికి వచ్చిందని, ఆ తమిళ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిన కథకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది.

మహానటి కీర్తి సురేష్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. దసరా సినిమాలో ఈ బ్యూటీ గ్లామర్ లుక్ లో అదరగొట్టిన విషయం తెలిసిందే. తండేల్ మూవీలో కూడా దాదాపుగా అలాంటి పాత్రే కావడంతో కీర్తి అవలీలగా పోషిస్తుందని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ కీర్తి సురేష్ ఈ పాత్రకు సరిపోదని, ఆమెను పక్కనపెట్టి సాయి పల్లవికి కథను వినిపించారట డైరెక్టర్.

- Advertisement -

ఇంకేముంది ఆ వెంట వెంటనే సాయి పల్లవి కథ వినడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం జరిగిపోయాయి. ఇక సాయి పల్లవి కథలను ఆచితూచి ఎంచుకుంటుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ మూవీ చేయడానికి ఒప్పుకుంది అంటే కథలో దమ్ము ఉండే ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇక సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమె ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలదు. డి గ్లామర్ లుక్ లో సాయి పల్లవి కనిపించినంత అందంగా మరే హీరోయిన్ కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే సాయి పల్లవి గ్లామర్ షో చేయకపోయినా హీరోయిన్ గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎట్టకేలకు తండేల్ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి నే ఫైనల్ చేశారు మేకర్స్. ఈ మూవీ 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు