Thandel : నాగ చైతన్య కోసం సాయి పల్లవి ఇంత కష్టపడుతోందా?

గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగచైతన్యతో తండేల్ మూవీలో ఆయనకు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. హిట్టే లేని నాగ చైతన్య కోసం సాయి పల్లవి ఇంతగా కష్టపడుతోందా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. గతంలో లవ్ స్టోరీ అనే మూవీతో బిగ్ స్క్రీన్ పై మీరు చేసిన రొమాన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ లో మరోసారి ఈ పెయిర్ రిపీట్ కాబోతోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతు కోసం సాయి పల్లవి తెగ కష్టపడిపోతోందట. మరి ఆమె అంతగా ఏం కష్టపడుతోంది అంటే… బంగార్రాజు మూవీ తర్వాత నాగ చైతన్యకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఆ తర్వాత వచ్చిన థాంక్స్, కస్టడీ సినిమాలు ప్లాప్ కావడంతో ఆయన ఖాతాలో వరస డిజాస్టర్లు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తండేల్ అంటూ కొత్త కథతో రాబోతున్నాడు నాగచైతన్య. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతోంది.

మత్స్యకారుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దాదాపుగా నెల రోజులపాటు వర్క్ షాప్స్ నిర్వహించిందట ఈ బ్యూటీ. ఈ మూవీలో నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుడి పాత్రలో కనిపించిన ఉండగా, ఆయన భార్యగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వారి ఇల్లు, భార్య పిల్లలు తదితర విషయాలను అవగాహన చేసుకోవడం కోసం నెలన్నర రోజులపాటు వాళ్ల లాగే జీవించిందట. నిజానికి హీరోయిన్లు సినిమాల్లో తమ పాత్రల కోసం ఇలా కష్టపడడం చాలా అరుదు. మొత్తం సినిమా గురించి ఆలోచించకుండా కేవలం తమ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఎంత త్వరగా పూర్తవుతుందా అని ఎదురుచూసే హీరోయిన్లు ఉన్నాయి ఈ కాలంలో ఇండస్ట్రీకి సాయి పల్లవి లాంటి అద్భుతమైన నటి దొరకడం అదృష్టం అనే చెప్పాలి.

- Advertisement -

ఇలాగైతే సాయి పల్లవి తన పాత్రలో జీవించడం ఖాయం. ఇక ఇంతగా కష్టపడుతుంటే మూవీ కూడా హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్లు సాయి పల్లవి నాగచైతన్యకు హిట్ ఇవ్వడం కోసం ఇంతగా కష్టపడుతోందా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సాయి పల్లవి కష్టం ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు