Hanuman: తేజ సజ్జపై బాలీవుడ్ లో ట్రోలింగ్..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “హనుమాన్” ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా ప్రారంభమై రిలీజ్ టైం నాటికి పెద్ద సినిమాల లెవెల్లో హైప్ తెచ్చుకుని బడా స్టార్ హీరోల సినిమాలకి పోటీగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్ మొదలుకొని ట్రైలర్ దాకా సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెంచేసాయో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగు కంటే హిందీ వెర్షన్ కే ఎక్కువ వ్యూస్ రాగా, లైక్స్ ఏకంగా వన్ మిలియన్ దాటింది.

అయితే అనుకోకుండా బాలీవుడ్ సోషల్ మీడియా లో సడన్ గా హనుమాన్ మూవీ పై ట్రోలింగ్ మొదలైంది. మొన్నటివరకు ట్రైలర్ లో vfx బాగా లేవని ట్రోల్ చేసిన బాలీవుడ్ వర్గాలు ఇప్పుడు హీరోపై ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఈ సినిమా vfx గ్రాఫిక్స్ పై ఇంత ఫోకస్ పెట్టిన మూవీ మేకర్స్ సినిమాకి మాత్రం పెద్ద హీరోని తెచ్చుకోలేకపోయారు, ఒక చిన్న పిల్లాడిలా ఉన్న వాడ్ని హీరో చేసారూ అంటూ తేజ సజ్జపై నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

అక్కడి సోషల్ మీడియా గురించి తెలిసిందే గా.. ఇప్పటికే సౌత్ సినిమాలు వాళ్ళని అన్ని రకాలుగా దాటేశాయన్న ఈర్ష్య కొంత మంది బాలీవుడ్ వర్గాల్లో ఉంది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మూవీ లో కంటెంట్ బాగుంటే హిట్ సంగతి ఆడియన్స్ చూసుకుంటారు. అలాగే హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అయ్యాక నోరు జారిన వాళ్లే ముక్కున వేలేసుకుంటారు అని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు