Personality Development: రాక్ సిక్స్ ప్యాక్ సీక్రెట్ డైట్ ఏంటో తెలుసా?

హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ ది రాక్ జాన్సన్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ గుండుతో, సిక్స్ ప్యాక్ కండలతో మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ చాలామందికి ఇన్స్పైరింగ్ గా మారాడు రాక్. ఒకవేళ ఇప్పటికీ రాక్ అంటే ఎవరో మీకు గుర్తు రాకపోతే ఆయన హీరోగా నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, బ్లాక్ ఆడమ్, జుమంజి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్తే ఇట్టే గుర్తు పడతారు. సినిమాల్లోకి రాకముందు రాక్ ప్రొఫెషనల్ రెజ్లర్. ఇక ప్రస్తుతం ఈ హాలీవుడ్ హీరో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్.

రాక్ కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. అంతేకాకుండా ప్రొఫెషనల్ ఫుడ్ బాల్ లీగ్ సహా యజమాని కూడా. ఇక ఈ హీరో శరీర దారుఢ్యం చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. అబ్బాయిలు కుళ్లుకుంటారు. మరి ఎప్పుడూ ఒకే విధంగా అంత ఫీట్ గా సిక్స్ ప్యాక్ ని ఈ హీరో ఎలా మైంటైన్ చేస్తున్నాడు. అంటే దానికి అతని డైట్ అండ్ ఆయన చేసే వ్యాయామాలే కారణం. ఇంతకీ రాక్ సీక్రెట్ డైట్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

డే 1
స్టీక్ (8 నుండి 10 ఔన్సులు)
గుడ్లు (1 మొత్తం గుడ్డు, 3 తెల్లసొన)
2 కప్పుల వోట్మీల్
పండ్ల రసం

- Advertisement -

డే 2
పసిఫిక్ Cod
1 కప్పు వెజ్ సలాడ్
స్వీట్ పొటాటో (10 నుండి 12 ఔన్సులు)

డే 3
2 కప్పుల తెల్ల బియ్యం
1 కప్పు వెజ్ సలాడ్
స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ (8 ఔన్సులు)

డే 4
పసిఫిక్ కాడ్ లేదా సాల్మన్
2 కప్పుల తెల్ల బియ్యం
1 కప్పు కూరగాయలు
1 టేబుల్ స్పూన్ ఫిష్ ఆయిల్

డే 5
స్టీక్ (8 ఔన్సులు)
1 కప్పు స్పినాచ్ సలాడ్
కాల్చిన బంగాళాదుంప (12 ఔన్సులు)

డే 6
పసిఫిక్ కాడ్ (cod)
2 కప్పుల తెల్ల బియ్యం
1 కప్పు కూరగాయలు

డే 7
30 గ్రా కేసైన్ ప్రోటీన్ మరియు నీరు (షేక్)
10 గుడ్డులోని తెల్లసొన, మిరియాలు, ఉల్లిపాయలు, పుట్టగొడుగుల వంటి కూరగాయలతో ఆమ్లెట్
1 టేబుల్ స్పూన్ చేప నూనె

ఈ డైట్ తో పాటు రాక్ సీక్రెట్ డైట్ లో చీట్ డే మీల్స్ కూడా ఉంటాయి. వారంలో ఏదో ఒక రోజు రాక్ ఈ డైట్ ను పక్కనపెట్టి తనకు ఇష్టమైన అన్ని రకాల ఫుడ్ లాగించేస్తాడట. రాక్ కు ఎక్కువగా స్వీట్స్ అంటే ఇష్టమట. స్వీట్స్ తో పాటు చీజ్, ప్రైస్, డెసర్ట్ 20 వంటకాలను తింటూ ఉంటాడు. దీంతోపాటు రాక్ ప్రతిరోజు వర్కౌట్ చేస్తూ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటాడు. వారానికి ఆరు రోజులు రాక్ జిమ్ కి వెళ్తాడు. 30 నుంచి 50 నిమిషాల పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.

Thumb : రాక్ కండల శరీరం సీక్రెట్ ఇదే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు