Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తే యూట్యూబ్ కు అడిక్ట్ అయినట్టే… జాగ్రత్త

ప్రస్తుతం మనం గడుపుతున్న డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. 24 గంటలు ఫోన్ చేతిలో ఉండడం, ఇక ఎప్పుడూ మెయిల్, వాట్సప్, ట్విట్టర్ అంటూ ఏదో ఒక నోటిఫికేషన్ రావడం, రెగ్యులర్ గా ఫోన్ చూస్తూ ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఇక ఇటీవల కాలంలో యూట్యూబ్ వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. చాలామంది యూట్యూబ్ కు అడిక్ట్ అయిపోతున్నారు. అయితే యూట్యూబ్ వ్యసనంగా మారడాన్ని డాక్టర్లు మానసిక అనారోగ్యంగా పరిగణించక పోయినప్పటికీ, దీనిని ఇతర ఇంటర్నెట్ వ్యసనాల లిస్టులో చేరుస్తున్నారు. మరి మీరు కూడా యూట్యూబ్ కు అడిక్ట్ అయ్యారా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

యూట్యూబ్ వీడియోలను ఎక్కువగా చూడడం, లేదా చూడడం గురించి ఆలోచించడం, ఏం చూడాలి అనేది ప్లాన్ చేయడం కోసం ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు అంటే మీరు యూట్యూబ్ కి అడిక్ట్ అయినట్టే. ఇక యూట్యూబ్ వీడియోలను చూడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వడం, యూట్యూబ్ లో చూడాలని తహతహలాడడం యూట్యూబ్ వ్యసనంగా మారింది అనడానికి సంకేతం.

యూట్యూబ్ చూడడం తగ్గించాలని కోరుకున్నప్పటికీ అలా చేయలేకపోవడం, యూట్యూబ్ కారణంగా ముఖ్యమైన పని, స్కూల్ లేదా కాలేజ్, ఇతర పనులను నిర్లక్ష్యం చేయడం, మీ యూట్యూబ్ వ్యూ లిస్ట్ నో ఇతరుల నుండి దాచడం, యూట్యూబ్ చూడడం ఆపేయడానికి ప్రయత్నించినప్పుడు కోపం లేదా చిరాకు వంటి ఎమోషన్స్ రావడం జరిగింది అంటే మీరు కచ్చితంగా యూట్యూబ్ కి అడిక్ట్ అయ్యారు అని అర్థం.

- Advertisement -

మరి ఇంతకీ యూట్యూబ్ చూడడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే… యూట్యూబ్ ని ఎక్కువగా చూడడం వల్ల కళ్ళపై, మెదడుపై, అలాగే ఆలోచన విధానంపై, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి ఇంతకీ ఈ అడిక్షన్ తగ్గించుకోవడం ఎలాగంటే సైకాలజిస్టులు ఇచ్చే థెరపీతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. యూట్యూబ్ ను ఎప్పుడు ఎంతసేపు చూడవచ్చు అనే లిమిట్స్ ను పెట్టుకోండి. ఆటో ప్లేను ఆఫ్ చేయండి. విరామం తీసుకోవడానికి యూట్యూబ్ రిమైండర్ ను సెట్ చేయండి. వేరే విషయాలపై దృష్టి సారించండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు