Malaikottai Vaaliban: మరోసారి ప్రయోగాత్మక చిత్రం తో వస్తున్న లెజెండరీ నటుడు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా తెలియనక్కర్లేదు. ఈయన చేసే ప్రతి చిత్రం లోను ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. కంప్లీట్ యాక్టర్ అని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు పొందిన ఈయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లూసిఫర్ తర్వాత ఆ స్థాయి విజయం లేని ఆయన మళ్ళీ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మధ్యలో  దృశ్యం మూవీ 2 హిట్ అయినా అది ఓటీటీ లో మాత్రమే విడుదలయింది. ప్రస్తుతం మోహన్ లాల్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు.

ఇక చివరగా ‘అలోన్’ సినిమా తో ముందుకు రాగా ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అయితే తాజాగా మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. “మలైకోటై వాలీబన్” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీని జల్లికట్టు ఫేమ్ “లిజో జోస్” డైరెక్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ సరికొత్తగా కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో భారీ గడ్డం, మీసాలతో ఉన్న లుక్ లో ఒక పెద్ద తాడుతో ఎదో లాగుతున్నట్టు, ఒక యోధుడిలా ఆ స్టిల్ ఉంది.

ఈ మూవీని జాన్ మ్యారి క్రియేటివ్ బ్యానర్ పై శిబూ బేబీ జాన్ నిర్మించాడు. కాగా ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “మలైకోటై వాలీబన్” సినిమాను 2023 ద్వితీయార్ధం లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు