Dasara: నేచురల్ స్టార్ నానికి సాయం చేసిన సమంత

టాలీవుడ్ అగ్ర నటి సమంత నుంచి తాజాగా వచ్చిన చిత్రం శాకుంతలం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత గుణ శేఖర్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన చిత్రం ఇది. గుణ శేఖర్ ఎనిమిదేళ్ల క్రితం అనుష్క శర్మతో రుద్రమదేవి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ చిత్రం 2015లో అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు రాబట్టిన ఐదవ తెలుగు చిత్రంగా నిలిచింది. అలాంటి డైరెక్టర్.. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న సమంతతో సినిమా చేస్తున్నాడంటే, అది కూడా మైథలాజికల్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి.

అలా శాకుంతలం సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రం శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. సమంత, అల్లు అర్హ నటన బాగున్నా.. గుణ శేఖర్ డైరెక్షన్ లోపాలు ఉన్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. అలాగే వీఎఫ్ఎక్స్ కార్టూన్స్ లా ఉన్నాయని కూడా టాక్ వచ్చింది. దీంతో తొలి రోజే నుంచే థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. శాకుంతలం చిత్రం బ్రేక్ ఈవెన్ కొట్టడం కూడా కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

అయితే ఇది నాని దసరా చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. మార్చ్ 30న విడుదలైన దసరా చిత్రం ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఇటీవల 100 కోట్ల మార్క్ ను అందుకున్న దసరా, మరిన్నీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం శాకుంతలం చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో వీకెండ్ లో ప్రేక్షకులు దసరా వైపునకు మళ్లే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ ఏప్రిల్ రెండో వారంలో సమంత శాకుంతలం రిలీజ్ కాకపోయింటే, మరి కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేవి.

- Advertisement -

కానీ, దిల్ రాజు పుణ్యమో.. శాకుంతలం మీద నమ్మకమో.. చాలా సినిమాలు వాయిదా వేసుకున్నాయి. కానీ, ప్రస్తుతం శాకుంతలం చిత్రానికి మిశ్రమ స్పందన రావడం నాని దసరాకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు. అలా సమంతకు తెలియకుండనే నానికి చాలా సాయం చేసింది అంటూ నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు