Tollywood: అనుష్క జాతకంలో అంత పెద్ద దోషం ఉందా..? అందుకే పెళ్లికి దూరంగా ఉన్నారా..?

లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆచితూచి సినిమాల ఎంపిక విషయంలో అడుగులు వేసే ఈమె బాహుబలి 2 సినిమా తర్వాత కేవలం భాగమతి, నిశ్శబ్దం వంటి రెండు చిత్రాలు మాత్రమే చేసింది. ఈ అందాల తార అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అప్పటినుండి తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు లేక అరకొర సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఒకానొక సందర్భంలో ఈమెకు సినిమాలే లేవు, అనుష్క శెట్టి సినీ కెరియర్ ముగిసినట్టేనని అనుకునే సమయంలో.. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క జీవితంలో దోషం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదని టాక్. ఆ దోషానికి పరిహారాలు చేసినప్పటికీ ఆమె కోలుకోలేని దెబ్బ తినాల్సి వస్తుందట. అందుకే అనుష్క పెళ్లి చేసుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. తన జీవితంలోకి వచ్చే అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉండాలని.. తన వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే వచ్చే వారి గురించి ఆలోచిస్తూ పెళ్లినే వదిలేసుకుందని సమాచారం. ఈ విషయం తెలిసిన కొందరు అనుష్క మనసు ఎంత గొప్పదో అంటూ కామెంట్లు పెట్టగా.. మరి కొంతమంది ఆమె ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలా..? అంటూ బాధపడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు