Tollywood: మెగా మేనల్లుడు సాయి బ్రేకప్ ధరమ్ తేజ్ లవ్ స్టోరీ

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ దాదాపు స్టార్ స్టేటస్ ను తెచ్చుకుంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ నుంచి ఇటీవల వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ వరకు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అలా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీని నుంచి ఇప్పడిప్పుడే కొలుకున్న సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

సాయి ధరమ్ నటించిన విరూపాక్ష అనే మిస్టరీ థ్రిల్లర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలా ఓ సందర్భంలో సాయి ధరమ్ తేజ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పెళ్లి, ప్రేమ, బ్రేకప్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల ఈ మెగా మేనల్లుడి పెళ్లి గురించి తెగ చర్చ జరుగుతుంది. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. “ఎవరో అంటున్నారు అని కాదు, నాకు పెళ్లి చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పాడు. అలాగే తన ప్రేమ విషయాలను కూడా పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, అయితే ప్రస్తుతం బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

“బ్రేకప్ తర్వాత అమ్మాయిలు అంటేనే భయం వేస్తుంది. ఈ ఘటన తర్వాత అమ్మాయిల విషయంలో చాలా సైలెంట్ అయ్యాను” అని వివరించాడు. అయితే, ఈ మెగా మేనల్లుడితో బ్రేకప్ చేసుకున్న యువతి గురించి మాత్రం పూర్తి వివరాలు చెప్పలేదు. ఇది తెలిసిన నెటిజన్లు, మెగా మేనల్లుడిని వదులుకున్న యువతి తెలుగు హీరోయిన్ రెజీనా అయి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ పిల్లా నువ్వు లేని జీవితం లో రెజీనా కసాండ్ర హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మళ్ళీ వీరు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ లోను జోడిగా నటించారు. ఆ సినిమా లోని ఈ జంట పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. అప్పట్నుంచి వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి సాయి ధరమ్ తేజ్ రెజీనా విషయం పై డైరెక్ట్ గా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు