Akkineni Family: నాగార్జున ఆస్తుల విలువ అన్నివేల కోట్లా..?

టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగార్జున గ్లామర్ సీక్రెట్ ఏంటో ఎవరికీ తెలియదు. ఆయన ఆరుపదుల వయస్సులోనూ కుర్ర హీరో గానే ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు – అక్కినేని అన్నపూర్ణ లకు 29 ఆగస్టు 1959లో చెన్నైలో జన్మించారు నాగార్జున. ఇక 1986లో విక్రమ్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నాగార్జునకు 1984లో దగ్గుపాటి లక్ష్మీతో వివాహం జరిగింది. వారికి అక్కినేని నాగచైతన్య జన్మించగా.. ఆ తరువాత పలు కారణాలవల్ల 1990లో విడాకులు తీసుకుని.. 1992లో అమలని వివాహం చేసుకున్నారు. వీరికి అక్కినేని అఖిల్ జన్మించారు. నాగార్జున ముందు నుంచి హీరోగా సక్సెస్ ల కంటే కూడా బిజినెస్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు.

నాగార్జున రియల్ ఎస్టేట్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. ఈయన టాలీవుడ్ లో రిచెస్ట్ పర్సన్ లలో ఒకరు. 2019 లెక్కల ప్రకారం ఈయన నికర ఆస్తుల విలువ 850 కోట్ల రూపాయలు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే నాగార్జున ఆస్తుల విలువ అయిదారు వేల కోట్లకు పైమాటే అన్న టాక్ ఉంది. కేవలం హీరో గానే కాకుండా మా టీవీ కి కో – ప్రొడ్యూసర్ గా కూడా పనిచేస్తున్నారు. నాగార్జునకి వాళ్ళ నాన్న ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ లు మొత్తం కలిపితే ఆయన ఆస్తులు 12 వేల కోట్ల దాకా ఉన్నట్టు సమాచారం. ఆయన ఆస్తులకి ఏ హీరో కూడా సాటిరారంటే ఆయన ఆస్తుల రేంజ్ ఏంటో తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈయన ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీగా.. ముఖ్యంగా ఆయన కొడుకులకు పోటీగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు