Tollywood: సింపుల్ గా ఉన్న ఎన్టీఆర్ వాచ్ ధర ఎన్ని కోట్లు అంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరంటే, ముందుగా రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ అంటూ స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ హీరోలు అందరూ కూడా ఎక్కువ శాతం సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. సినిమా రంగంలో మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా బాగా ఉన్న వాళ్లే అని చెప్పొచ్చు. అందుకే ఈ స్టార్ హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సినిమా షూటింగ్స్ సమయంలో ఎంత కష్టపడ్డా, బయట మాత్రం లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాల్లో ఉంటారు.

అలాగే కొన్ని సందర్భాల్లో ఈ హీరోలు ధరించే టీ షర్ట్స్, షర్ట్స్, కార్లు, వాచ్ ల ధరలపై చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటీవల రామ్ చరణ్ షర్ట్ గురించి, పవన్ కళ్యాణ్ షూస్, టీ షర్ట్ ధరలపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నందమూరి వారసుడు jr ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధరపై తెగ చర్చ జరుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు కూడా సందడి చేశారు.

దానికి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ ఒక సింపుల్ వాచ్ ధరించి కనిపించాడు. దీంతో ఫ్యాన్స్.. ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఏ కంపెనీ ? ధర ఎంత ఉంటుంది ? అంటూ సెర్చ్ చేశారు. ఈ క్రమంలో ఆ సింపుల్ వాచ్ ధర చూసి అవాక్కవుతున్నారు. ఎన్టీఆర్ ధరించిన ఆ సింపుల్ వాచ్ ధర అక్షరాల 8 కోట్లు. రిచర్డ్ మిల్లే బ్రాండ్ కి చెందిన ఈ వాచ్ స్టార్టింగ్ ప్రైస్ కోటి నుంచి ఉంటుందట. అంతే కాదు.. ప్రపంచంలో ఖరీదైన వాచ్ బ్రాండ్ లలో రిచర్డ్ మిల్లే బ్రాండ్ ముందు వరుసలో ఉంటుందట.

- Advertisement -

ఇది తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. “అది సార్ మా తారక్ అన్న బ్రాండ్” “ఆ ఒక్క వాచ్ అమ్మితే, జీవితాలు సెట్ అయిపోతాయి” అంటూ అత్తారింటికి దారేది సినిమాలోని డైలాగ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు