Lata Mangeshkar: లతా మంగేష్కర్ పై విష ప్రయోగం.. ఇప్పటికైనా మిస్టరీ వీడిందా..?

Lata Mangeshkar

తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించి అంతకుమించి పాపులారిటీ దక్కించుకున్న గాన గంధర్వి, భారత గాన కోకిల లతా మంగేష్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. 92 సంవత్సరాల వయసులో .. 2022 ఫిబ్రవరి 6వ తేదీన కరోనా మహమ్మారి బారినపడి తుది శ్వాస విడిచింది.. ఇక ఈమె మరణానికి దేశం మొత్తం సంతాపం ప్రకటించింది ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుకొని సినీ రాజకీయ ప్రముఖులు సాధారణ ప్రజలు కూడా లతా మంగేష్కర్ మరణం పై సంతాపం వ్యక్తం చేశారు.. ఇక ఈరోజు ఆమె వర్ధంతి కావడంతో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.

గతంలో లతా మంగేష్కర్ పై ఒక్కసారి విష ప్రయోగం జరిగిందట. అయితే ఈమె మరణించి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆమెపై విష ప్రయోగం ఎవరు చేశారు? ఎలా జరిగింది ? అన్న విషయాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి..
అసలు విషయంలోకెళితే 1963 సంవత్సర కాలంలో బాలీవుడ్ లో తన హవా నడిపిన లతా మంగేష్కర్ పై ఒకసారి విష ప్రయోగం జరిగిందట. బెడ్ మీద నుంచి లేచి నిలబడే శక్తి కూడా ఆమె కోల్పోయారు.. అంతటి దీనావస్థకు చేరుకున్న ఆమె.. మూడు రోజులపాటు కళ్ళు కూడా తెరవలేదట .. దాదాపు పది రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స అందించాక నెమ్మదిగా కదలికలు ప్రారంభమయ్యాయని సమాచారం..

అలా మూడు నెలలు గడిచాక మళ్ళీ సాధారణ స్థితిలోకి వచ్చారు లతా మంగేష్కర్. అయితే లతా మంగేష్కర్ పైన విషప్రయోగం జరిగిందని డాక్టర్లు కూడా చెప్పారు.. కానీ ఈ విషయాల మీద ఎప్పుడు కూడా ఆమె నోరు విప్పి చెప్పలేదు.. ఎవరిని నిందించలేదు..లతా మంగేష్కర్ అలా హాస్పిటల్లో ఉన్న సమయంలో ఇంట్లో వంట చేసే పనిమనిషి మాత్రం కనిపించకుండా పోయారట.. అసలు ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అన్న కారణాలు మాత్రం ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ విషయాలపై లతా మంగేష్కర్ కూడా నోరు విప్పలేదు.. ఇక ఈ సమస్య నుంచి ఆమె బయటపడ్డాక మళ్ళీ పాటల ప్రపంచంలో దూసుకుపోయారు.. సంగీతం ప్రపంచంలో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమెపై విష ప్రయోగం జరిగిందని తెలిసి అప్పట్లో సినీ పరిశ్రమ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

- Advertisement -

ఇక చాలామంది దీని మిస్టరీ చేదించే ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి దీనికి తగిన ఆధారాలు లభించలేదు.. అసలు ఈ విషయంపై కుటుంబ సభ్యులు కూడా స్పందించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు