Malavika Sharma : ఈ బ్యూటీ ఆశలన్నీ ఈ సినిమాపైనే! సక్సెస్ కొడుతుందా?

Malavika Sharma : టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల సంగతి పక్కన బెడితే గ్లామర్ హీరోయిన్లకు కొదవే లేదు. ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్లలో టాలెంటెడ్ బ్యూటీ “మాళవిక శర్మ” ఒకరు. ముంబై కి చెందిన ఈ భామ అయిదేళ్ల కిందట మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘నేల టికెట్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫస్ట్ మూవీ తోనే డిజాస్టర్ అందుకుంది. అందువల్ల అందం ఉన్నా వెంటనే ఆఫర్లు పలకరించలేదు. ఆ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ సినిమాలో నటించినా ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. కానీ ఆ సినిమాలో మాళవిక శర్మ సెకండ్ లీడ్ గా నటించింది. అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ కాదు, అందువల్ల ఆ సినిమాతో పెద్ద గుర్తింపు రాలేదు. మధ్యలో తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇక ఆఫర్లు లేక ఓ ఏడాది పాటు వెయిట్ చేసిన మాళవిక 2024 లో మాత్రం రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో ఒకటి మాచో స్టార్ గోపీచంద్ హీరో గా నటించిన భీమా కూడా ఒకటి, మరొకటి సుధీర్ బాబు నటించిన ‘హరోంహర’.

Malavika Sharma starrer Harom hara release tomorrow

ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమాపైనే?

ఇక మాళవిక శర్మ (Malavika Sharma) హీరోయిన్ గా నటించిన “భీమా” మూడు నెలల కింద రిలీజ్ కాగా, మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఆ సినిమా ఓవరాల్ గా ప్లాప్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు మాళవిక శర్మ ఆశలన్నీ హరోంహర సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించగా, హరోంహర సినిమా ఫైనల్ గా జూన్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మాళవిక శర్మకి పెద్దగా తెలుగులో సినిమాలు లేవని సమాచారం. అప్పుడప్పుడూ ఫోటోషూట్లతో హడావిడి చేస్తున్నా, ఒక్క హిట్ అయినా వస్తేనే అవకాశాలు నిర్మాతలు ఇస్తారు. కాబట్టి మాళవిక శర్మ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయిప్పుడు. ఈ సినిమా హిట్ అయితేనే ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు వస్తాయని అంటున్నారు నెటిజన్లు. లేదంటే ఐరన్ లెగ్ ట్యాగ్ పంపిస్తారని అంటున్నారు.

- Advertisement -

రేపే హరోంహర…

ఇక హరోంహర సినిమా భారీ అంచనాలతో జూన్ 14న అంటే రేపే విడుదల అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో హైప్ ను మ్యాచ్ చేసే విధంగా, టాక్ గనుక పాజిటివ్ గా వస్తే కల్కి వచ్చే వరకు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక హరోం హర సినిమాని నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, పలు చోట్లలో నిర్మాతలు ఓన్ రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇక జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించడం జరిగింది. మరి మాళవిక శర్మ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు