HBD Nora fatehi: నార్త్ టు సౌత్.. అందులో ఈమెదే హవా..!

HBD Nora fatehi

ప్రముఖ ఐటమ్ గర్ల్ నోరా ఫతేహి ప్రతి ఒక్కరికి సుపరిచితమే… గ్లామర్ వలకబోయడంలో ఆమెకు ఆమె సాటి.. తన అందంలో, గ్లామర్ విషయంలో ప్రేక్షకులను అలరించిన ఈమె.. మోడల్ గా, డాన్సర్ గా, నటిగా, సింగర్ గా , రియాల్టీ షోస్ కి జడ్జిగా కూడా వ్యవహరించి ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా తన అందచందాలతో కుర్ర కారును హీటెక్కిస్తోంది. ఇకపోతే ఈరోజు ఈ అందాల భామ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1992 ఫిబ్రవరి 6న కెనడాలో జన్మించిన ఈమె టొరెంటో లోని వెస్ట్ వ్యూ సెంటినియల్ సెకండరీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రముఖ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నోరాఫతేహి హిందీ, తెలుగు సినిమాలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె నటించిన మొదటి హిందీ చిత్రం రోర్ :టైగర్స్ ఆఫ్ సుందర్బన్.. కమల్ సదాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత అదే ఏడాదిలో “క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ”లో కూడా నటించి మెప్పించింది.. ఈ సినిమా తర్వాత పలు ఐటెం సాంగ్స్ వైపు ఫోకస్ పెట్టిన ఈమె మొదటిసారి తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో “ఇట్టాగే రెచ్చిపోదాం” అంటూ ఎన్టీఆర్ తో డాన్స్ కుమ్మేసింది. ఈ పాటకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోలగోల చేశారు. దీంతోపాటు మలయాళం చిత్రం డబుల్ బ్యారెల్ లో కూడా స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

అలాగే 2015లో ప్రముఖ రియాల్టీ టెలివిజన్ షో బిగ్ బాస్ నైన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన నోరా 2016లో రియాల్టీ టెలివిజన్ డాన్స్ షో ఝలక్ దిఖ్ల జా 9 లో పాల్గొని తన డాన్స్ స్కిల్స్ ని చూపించింది.. 2018లో సత్యమేవ జయతే సినిమాలో దిల్బర్ సాంగ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అంతేకాదు ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 20 మిలియన్ న్యూస్ కాబట్టి ఇలాంటి మాసివ్ రెస్పాన్స్ అందుకున్న తొలి హిందీ పాటగా కూడా నిలిచింది. 2019లో మొరాకో మ్యాగజైన్ కవర్ పై కూడా దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇక వీటితోపాటూ బాహుబలి సినిమాలో మనోహరీ పాటలో తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్న నోరా..కిక్ -2 , లోఫర్ , ఊపిరి చిత్రాలలో కూడా నటించింది.. ఐటమ్ సాంగ్ లలో తెలుగు, తమిళ్ ,మలయాళం, కన్నడ, హిందీ అంటూ తదితర భాషల్లో మంచి క్రేజ్ సంపాదించి.. నార్త్ టు సౌత్ అంతటా తన హవా నడిపింది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు