Dulquer Salman : ఛాన్స్ దొరికితే ఆగస్టు లోనే రావాలని చూస్తున్నాడు… కానీ ఈ రెండిట్లో ఏది?

Dulquer Salman : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహానటి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో, సీతారామం తో మరింత చేరువయ్యాడు. ఎంతో మందికి ఫేవరేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగువాడు అయ్యేలా వరుస తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో “లక్కీ భాస్కర్” సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని అంచనాలని పెంచేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ ఫోర్ శ్రీకర స్టూడియోస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ లో ఒక మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన భాస్కర్ గా దుల్కర్ (Dulquer Salman) కనిపిస్తున్నాడు. అయితే ఊహించని విధంగా ఆ ఉద్యోగి అకౌంట్లో చాలా డబ్బు ఉంటుందని టీజర్ చివర్లో ఆ పాయింట్ చెప్పడం తో సినిమాపై ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.

Dulquer Salman starrer Lucky Bhaskar will release in August

పీరియాడిక్ నేపథ్యంలో లక్కీ భాస్కర్…

ఇక లక్కీ భాస్కర్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించగా, 90స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఆర్ట్ వర్క్ వల్ల సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేక్షకులను 30 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్లే విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నాడు. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో స్టాక్ మార్కెట్ కు సంబంధించిన పాయింట్ ఉంటుందని టాక్. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పైనే అందరి ఫోకస్ ఉంది ఇప్పుడు.

- Advertisement -

ఆగష్టు లో ప్లాన్.. కానీ రెండు డేట్ల మధ్య తికమక?

అయితే లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ పైనే కొన్ని రోజులుగా గందరగోళం నెలకొని ఉంది. ఈ సినిమా టీజర్ వచ్చినపుడు జులై లో వస్తుందన్నారు. కానీ జూన్ నుండి జులై మధ్య పెద్ద సినిమాల పోటీ ఉండడంతో తప్పుకుంది. ఇక ఇప్పుడు ఆగష్టు రిలీజ్ పై కన్నేసింది చిత్ర యూనిట్. అయితే ఆగష్టు లో రెండు రిలీజ్ డేట్లలో ఏదో ఒకదానిపై ఖర్చిఫ్ వేశారు మూవీ యూనిట్. అందులో ఒకటి ఆగష్టు 15. గత కొన్ని రోజులుగా పుష్ప 2 వాయిదా పడుతుంది అని వార్తలు వస్తుండగా, ఆ రోజుపై పలు సినిమాలు వద్దామని చూస్తున్నాయి. అలాగే ఇప్పుడు పుష్ప గనుక ఆ డేట్ నుండి తప్పుకుంటే ఆ డేట్ కి లక్కీ భాస్కర్ రావాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇది మిస్ అయితే ఆగష్టు 29న లక్కీ భాస్కర్ ని రిలీజ్ చేయాలనీ నాగవంశీ అనుకుంటున్నాడు. ఆ డేట్ కి సరిపోదా శనివారం సినిమా వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ డిలే వల్ల ఆ సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే లక్కీ భాస్కర్ ఖచితంగా ఆ డేట్ కి వస్తాడనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఈ రెండు డేట్ల మధ్య లక్కీ భాస్కర్ ఊగిసలాడుతున్నాడు. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు