Ram Charan Upasana: క్లీంకారా చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో..!

Ram Charan Upasana

మెగా కోడలు ఉపాసన ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్స్, గ్రాండ్ పేరెంట్స్ ని కలవడం, రాంచరణ్ ఫొటోస్ అలాగే క్లీంకార్ కి సంబంధించిన అప్డేట్స్ ఇలా ప్రతిదీ కూడా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన క్లీంకారా సిస్టర్స్ ను కూడా అభిమానులకు పరిచయం చేసింది. అదేంటి క్లీంకారకు చెల్లెళ్ళు లేరు కదా… మరి ఎలా పరిచయం చేసింది అన్న సందేహం అభిమానులలో కలుగుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే… ఉపాసన చెల్లెలి పిల్లలు… క్లీంకారకు చెల్లెళ్ళు అవుతారు కదా.. వారే వీరు..

ఉపాసన చెల్లెలు అనుష్పాల ఇటీవల కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అనూష్పాల డిసెంబర్ 2021 లో అర్మాన్ ఇబ్రహీంను వివాహం చేసుకుంది. గత ఏడాది చివర్లో ఆమె ప్రెగ్నెంట్ అవ్వగా.. ఈ మధ్యనే ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇకపోతే తాజాగా పిల్లల నామకరణం ఫంక్షన్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా సందడి చేశారు.. అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఉపాసన షేర్ చేసింది. అద్భుతమైన అందమైన ముగ్గురు సిస్టర్స్ ని పరిచయం చేస్తున్నాము.. క్లీంకార కొణిదెల తన చెల్లెలు అయిన ఐరా పుష్పా ఇబ్రహీం మరియు రికా సుచరిత ఇబ్రహీంతో చేరిపోయింది అంటూ ఉపాసన రాసుకొచ్చింది .

అంతేకాదు ఈ ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది.. ఈ ఫోటోలలో క్లీంకారాను చరణ్ ఎత్తుకోగా.. ఐరా పుష్పా ఇబ్రహీం అలాగే రికా సుచరిత ఇబ్రహీం లను వారి తల్లిదండ్రులు ఎత్తుకోగా.. వారి వెనకాలే ఉపాసన కనిపించారు.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టెంట చాలా వైరల్ గా మారుతోంది. సూపర్ క్యూట్ జోడీలు అంతకుమించి వారి క్యూట్ పిల్లలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది సూపర్ పిక్ అంటూ కామెంట్లు చేయగా.. ఇంకొంతమంది క్లీంకారకు మంచి తోడు దొరికింది.. ఆడుకోవడానికి ఏకంగా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.

- Advertisement -

Upasana shared Ram charan and kleenkara Photos

ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు