Upasana: మామ కి అండగా మెగా కోడలు.. రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ..!

Upasana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో జనసేన పార్టీని స్థాపించి..తన పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లి.. అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోని తాజాగా ఈయనకి మెగా కోడలు , కామినేని వారసురాలు ఉపాసన అండగా నిలిచింది. అసలు విషయంలోకి వెళితే.. రామ్ చరణ్ భార్యగా.. మెగా ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన తన వ్యక్తిత్వంతో మెగా ఆడియన్స్ తో పాటు అందరి ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళ్తోంది. మరోవైపు అపోలో సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఉపాసన.. రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది..

ఇటీవల తన తాత అపోలో ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. చెన్నై సిటీలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన ఈమె.. తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.. ఈ క్రమంలోనే తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా ఈమె స్పందించారు.. విజయ్ సినిమాల ద్వారా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఆయన నిర్ణయించుకోవడం ఒక గొప్ప విషయం.. ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ..మీకు మార్పు కావాలి అనుకున్నప్పుడు లీడర్ ఎవరు అని చూడకుండా సపోర్ట్ చేయండి.. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా సరే అతడిని వెనక్కి లాగే ప్రయత్నం చేయకండి..అంటూ ఆమె తెలిపింది..

మార్పు కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి అని.. అప్పుడే సమాజంలో మార్పు కనిపిస్తుంది అని.. ఇప్పుడు విజయ్ తో ఆ మార్పు తమిళనాడులో కూడా వస్తుందని తాను నమ్ముతున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. ఇకపోతే మరొకవైపు మెగా ఫ్యామిలీ కూడా పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే… ఒకప్పుడు రాజకీయాలలో కనిపించిన చిరంజీవి ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యారు తాజాగా ఉపాసన చిన్న మామయ్యలైన నాగబాబు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ముందుకు వెళ్తున్నారు.. వీరికి అండగా నిలుస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించింది.

- Advertisement -

మరి సేవా కార్యక్రమాలతో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఉపాసన భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తారా అన్న ప్రశ్న ఎదురవగా.. దీనికి ఆమె సమాధానం ఇస్తూ … రాజకీయాల్లోకి రావడం అనేది మాత్రం జరగదు.. కానీ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించే నాయకుడికి నా సపోర్టు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.. దీన్ని బట్టి చూస్తే తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కి ఈమె పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు