Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు నాలుగేళ్లు… మరో నాలుగేళ్లు కావాలా ఏంటి?

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది దర్శకులకు. ఇక ఇప్పటికే ఆయనతో సినిమాలు కమిట్ అయిన డైరెక్టర్స్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన మొదలు పెట్టి మధ్యలోనే వదిలేసిన “హరిహర వీరమల్లు” అనే సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా “హరిహర వీరమల్లు” చేయబోతున్నాడు అన్న విషయం పవర్ స్టార్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేసింది. ఏ ముహూర్తాన ఆ సినిమాను మొదలు పెట్టారో గానీ ఇప్పటికీ ఆ మూవీ పూర్తి కాలేదు. “హరిహర వీరమల్లు” మూవీ 2020 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు 2024 జనవరి పూర్తి అయిపోతుంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆర్థిక అడ్డంకులు, కరోనా మహమ్మరి, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై కాన్సన్ట్రేట్ చేయడం వంటి సమస్యల కారణంగా ఈ మూవీ ఇంకా పెండింగ్ దశలోనే ఉంది.

2020లో “హరిహర వీరమల్లు” ప్రీ లుక్ ని, 2021 లో ఫస్ట్ లుక్, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. వాటికి సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని షూటింగ్స్ స్టిల్స్ మినహా చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్లు రాలేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై బహుశా మేకర్స్ కి కూడా క్లారిటీ లేదు.

- Advertisement -

మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఒక పీరియాడిక్ డ్రామాలో నటిస్తుండడం వల్ల “హరిహర వీరమల్లు”పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది ఒక పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. కానీ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించకపోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు, సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటున్నాడు క్రిష్. ఈ సినిమా షూటింగును స్టార్ట్ చేసిన తర్వాతే పవన్ భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలను పూర్తి చేశాడు. అనంతరం సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కమిట్ అయిన “ఓజి” మూవీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలకు టైం కేటాయించారు.

ఇలా నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికి “హరిహర వీరమల్లు’కు మోక్షం లభించలేదు. ఒకవేళ పవన్ ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్లీ సినిమాలపై కాన్సెంట్రేట్ చేసినప్పటికీ అసలు “హరిహర వీరమల్లు” పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఎవరికి అంతుచిక్కని విషయం. కుదరట్లేదు కదా అని ఆ ప్రాజెక్టును పక్కన పడేయట్లేదు, అలాగని పట్టాలెక్కించట్లేదు. ఇదంతా చూస్తుంటే టీంకు “హరిహర వీరమల్లు”ను పూర్తి చేయడానికి మరో నాలుగేళ్లు కావాల్సి వస్తుందేమో అన్పిస్తోంది. పాపం క్రిష్… పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాకు కమిటై గత నాలుగేళ్లుగా అదే ప్రాజెక్టులో చిక్కుకుపోయాడు. మరి ఈ డైరెక్టర్ కు ఈ సినిమా నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు