Pawan Kalyan: OG నుంచీ కిక్ ఇచ్చే న్యూస్..రిలీజ్ డేట్ లాక్..!

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లైన్ అప్ చూస్తే మాత్రం అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు..ఒక సినిమా తర్వాత మరొకటి ప్రకటిస్తూ అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ..ఈ క్రమంలోనే ఆయన వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూ మరొకవైపు రాజకీయాలలో కూడా శరవేగంగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన మూడు సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. అందులో హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజీ సినిమాలను తెరకెక్కించబోతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా షూటింగ్లను కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదండోయ్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాతే తిరిగి సినిమా షూటింగ్లకు హాజరవుతారు అంటూ ప్రకటించడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. దీంతో అభిమానులను ఖుషీ చేయడానికి తన షెడ్యూల్ ని పక్కన పెట్టి సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్.. అందులో భాగంగానే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎదురు చూడకుండా ప్రస్తుతం ఉన్న సమయంలోనే.. తన డేట్స్ కేటాయిస్తూ సినిమాలను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

క్రమం లోనే పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉండగా.. అన్నిటికంటే చివరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినా.. ఇప్పుడు విడుదలకు సిద్ధం చేశారు.DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాహో దర్శకుడు సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానులకు శుభవార్తను తెలిపారు మేకర్స్ .. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తుంటే త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేస్తున్నారు. ఇందులో అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ తన విశ్వరూపాన్ని చూపించనున్నట్లు సమాచారం. మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత MM.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు