Puri Jagannath: మేలైన సమాజం కోసం అలాంటి మహిళలే కావాలి – పూరీ

Puri Jagannath

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చి స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇటీవల డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా చలామణి అవుతున్న పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్ ద్వారా తాను చెప్పాలనుకున్న మాటలను నేరుగా తన గాత్రంతోనే అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా సింగిల్ ఉమెన్ గురించి చెబుతూ ఒక వీడియోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఆ వీడియోలో ఏముంది అంటే పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..” మీరు స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటే.. ఇక మీరు సింగల్ గానే ఉండిపోండి.. ఎంతో శక్తివంతమైన మహిళలు మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరు.. ఇలా సింగల్ గా ఉండడం వల్ల పాపులేషన్ తగ్గుతుంది.. కష్టాలు తగ్గుతాయి.. ప్రొడక్టివిటీ పెరుగుతుంది.. మనశ్శాంతిగా ఉంటుంది.. అదేవిధంగా మహిళలకు గౌరవం తెచ్చినట్టు కూడా అవుతుంది అంటూ ఆయన వెల్లడించారు.. ప్రస్తుతం మన భారతదేశంలో చాలా మంది విడాకులు తీసుకున్న మహిళలు ఉన్నారు.. అలాగే భర్త నుంచి దూరంగా ఉన్నవారు.. భర్త చనిపోయిన వారు ఉన్నారు.

నేను కోరుకునేది వాళ్లు కాదు.. సింగిల్ బై ఛాయిస్ అనేవాళ్ళు కావాలి. ఐ డోంట్ నీడ్ మ్యాన్.. ఇన్ మై లైఫ్.. అనే వాళ్ళు కావాలి.. వాళ్ళందరూ కూడా దేవతలతోనే సమానం.. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్స్ మనదేశంలో ఓ మూడు కోట్ల మంది ఉంటే ఇక మన దేశం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఇలా మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో ఈ దేశం ఎప్పుడు పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ సింగిల్ ఉమెన్ గురించి పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ఇకపోతే ఇదివరకే ఛార్మీ లాంటి హీరోయిన్లు తాము మ్యారేజ్ మెటీరియల్ కాదు అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈయన ఇలా ఎందుకు కామెంట్లు చేశారన్నది ఇప్పుడు కొత్త అనుమానాలకు దారితీస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు