Puri Jagannath: పూరి జ’గన్’ టార్గెట్ మిస్ అవుతున్నాడా.?

 

బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడున్న డైరెక్టర్ల లో పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేకమైన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా తీయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, అది తక్కువ సమయంలో కథ రాసి డైలాగులు రాసి సినిమా షూటింగ్ జరిపేసి షూటింగ్ మొదలు పెట్టినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేయటం పూరీకి అలవాటు. అయితే పూరి జగన్నాథ్ రీసెంట్ టైమ్స్ లో ఫెయిల్యూర్స్ ను చవిచూస్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ గాడిలోకి వచ్చాడు అనుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో మళ్లీ నష్టాల్లో మునిగిపోయాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఎక్కడో నిలబడతాడు అని ఎంతోమంది ఊహించారు. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ పాలు అయింది. అలాగే సినిమా జరుగుతున్నప్పుడే పూరీ డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు.

- Advertisement -

అయితే లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 8న రిలీజ్ చేస్తానని ఇదివరకే ప్రకటించాడు పూరి జగన్నాథ్. కానీ ఈ సినిమా ఇంకా 40 రోజులు పాటు షూటింగ్ కావాల్సి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మార్చి 8 కి ఈ సినిమా వచ్చే అవకాశం లేదంటున్నారు చాలామంది సినీ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు.

ఈ సినిమా అనేది పూరి జగన్నాథ్ యొక్క జీవితాన్ని డిసైడ్ చేయనుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూరీ లైగర్ తో ఎంత మేరకు నష్టాల్లోకి వెళ్లిపోయాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్టిబూటర్స్ కూడా రోడ్లెక్కి నిరసన తెలిపిన రోజులు కూడా ఉన్నాయి. వాటికి పూరి కూడా ఆడియో రెస్పాండ్ అయిన విధానం కూడా మనకు తెలిసిందే. అయితే పూరికి డబుల్ ఇస్మార్ట్ సినిమా అనేది ఖచ్చితంగా ఒక మైలురాయి లాంటిది.

ఈ సినిమా హిట్టయితే మళ్లీ పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలద్రొక్కుగలడు. లేదు అనంటే మళ్ళీ పూరి నిలబడాలంటే ఇంకొన్నేళ్లు పడుతుంది. పూరీకి నిల్చోడం కొత్త ఏం కాదు కానీ ఇప్పుడు మాత్రం ఉన్నది లోతులో కాదు పాతాళంలో. అందుకు పూరీకి సినిమా సక్సెస్ ఖచ్చితంగా అవసరం. కొంచెం లేట్ అయినా కూడా క్వాలిటీ సినిమా తీసి హిట్టు కొడదామనే పూరీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు