Game Changer: సంక్రాంతి మిస్ అయ్యారు , దసరా ఫిక్స్ అవుతారా.?

 

దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న తరుణంలో ప్యాన్ ఇండియాకు సరిపడ కంటెంట్ ని ఆ రోజుల్లోనే తెరకెక్కించడం శంకర్ కి సాధ్యమైంది. 1993లో రిలీజ్ అయిన జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు, జీన్స్, బాయ్స్, ప్రేమికుడు వంటి సినిమాలు అద్భుతమైన హిట్స్ ను అందుకున్నాయి.

శంకర్ సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఉంటుందని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చింది. శంకర్ గురించి కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా తెలుసు. ఎందుకంటే తమిళ్లో శంకర్ తీసిన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. శంకర్ చేసిన రోబో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

రోబో సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రజనీకాంత్ ని చూపించిన విధానం, స్టైల్ తో పాటు సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఇవన్నీ కూడా ఆ సినిమాని మంచి స్థాయిలో నిలబెట్టాయి. ఆ సినిమా టైంలోని మెగాస్టార్ చిరంజీవి కూడా శంకర్ లాంటి దర్శకుడు తో వర్క్ చేయాలని నా డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ మెగాస్టార్ కి ఆ డ్రీం ఫుల్ ఫీల్ కాలేదు. కానీ తన కుమారుడు రాంచరణ్ కి ఆ డబ్బింగ్ ఫుల్ ఫీల్ అయింది.

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజెర్ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్న సినిమాని ఇదివరకే చాలా కథనాలు వినిపించాయి. ముందుగా ఈ సినిమాని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ఎంతగానో ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాని ఇప్పుడు అక్టోబర్ 2న గాని దసరా కానుక అక్టోబర్ 12న గాని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎట్టకేలకు సంక్రాంతికి మిస్ అయిన ఈ సినిమా కనీసం దసరా కైనా పాగా వేస్తే చరణ్ అభిమానులు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు