Shyamala Devi: కృష్ణంరాజుతో బలవంతంగా పెళ్లి – శ్యామలాదేవి షాకింగ్ కామెంట్స్..!

ఎన్ని తరాలు మారినా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే పేరు కృష్ణంరాజు.. ఆతిథ్యానికి మరో పేరు అంటే ఈయన పేరే చెబుతారు. 1966లో చిలకా గోరింక అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణంరాజు.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం దక్కించుకున్నారు. నటనతోనే కాకుండా రాజకీయాల్లో కూడా చేరి ప్రజాసేవలోనూ తానేంటో నిరూపించుకున్న ఈయన 2022 సెప్టెంబర్ 11వ తేదీన హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం ప్రజలను జీర్ణించుకోలేకపోయేలా చేసింది. ఆయన మరణం నుంచి ఇప్పటికీ తేరుకోని వారిలో ఆయన భార్య శ్యామలాదేవి కూడా ఒకరు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను వెల్లడించింది.

కృష్ణంరాజుకు ఇద్దరు భార్యలన్న విషయం తెలిసిందే. అందులో మొదటి భార్య సీతాదేవి.. చెన్నైలో షాపింగ్ కు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించింది. అంతకుముందే వారికి పుట్టిన మగ బిడ్డ కూడా వైద్యుల నిర్లక్ష్యంతో మరణించాడు. ఇక శ్యామల దేవిని కృష్ణంరాజు వివాహం చేసుకోవడం జరిగింది. అయితే బలవంతంగా కృష్ణంరాజు కిచ్చి శ్యామలాదేవి గొంతు కోశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించగా తాజాగా వీటిపై మాట్లాడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు..శ్యామలాదేవి మాట్లాడుతూ.. ” కృష్ణంరాజు మనసు నాకు ముందు నుంచి తెలుసు.. ఎంతో మంచి వ్యక్తి ..ఎప్పుడూ దానధర్మాలు చేస్తూ ఉంటారని మా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. భార్యను, కొడుకును పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో ఉండేవారు. దీంతో కృష్ణంరాజు తండ్రి .. కొడుకు గురించి మదనపడేవారు.. నా కొడుకు అందరి ఆకలి తెలుసుకొని అన్నం పెడుతూ ఉంటే.. వాడి ఆకలి వాడికే తెలియకుండా పోతుంది.. భార్య ఉంటే ఆమె వాడి ఆకలి తీర్చేది అని అనుకొని రెండో పెళ్లి చేయాలనుకున్నారు.

అయితే రెండో పెళ్లికి కృష్ణంరాజు ఒప్పుకోలేదు.. దాంతో ఆయన రెండు మూడు రోజులు నిరాహార దీక్ష చేసి పెళ్లికి ఒప్పించారు.. మా బంధువుల ద్వారా మామయ్య ( కృష్ణంరాజు తండ్రి) కి నా గురించి తెలియగా.. అప్పటికే నాకు… ఆయనకు పెళ్లి అయిందని.. భార్య ఆక్సిడెంట్ లో చనిపోయింది అన్న విషయం కూడా తెలుసు. అయితే ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి నేను రెండో పెళ్ళికి ఒప్పుకున్నాను.. అయితే మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.. పైగా రెండో పెళ్లి, పిల్లలు కావాలనుకుంటారో లేదో అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చిన నేను మా అమ్మకు నచ్చజెప్పి పెళ్లి చేసుకున్నాను.

- Advertisement -

అయితే కృష్ణంరాజును నేను వివాహం చేసుకునే సమయానికి చాలా చిన్న పిల్లను.. నన్ను బలవంతంగా ఒప్పించారని అనుకున్న కృష్ణంరాజు తన కజిన్ ను నా దగ్గరకు పంపించి కనుక్కోమని చెప్పారు. అయితే నేను ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నాను అని చెప్పాను. అలా మా పెళ్లి జరిగింది .. ఆయనే నా సర్వస్వం, నాకు తల్లి, తండ్రి ,గురువు, దైవం అన్ని ఆయనే.. ఇప్పుడు నేను ఉన్నా కూడా ఆయన జ్ఞాపకాలతోనే మిగిలి ఉన్నాను..” అంటూ శ్యామలాదేవి చెప్పుకొచ్చింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు