Relationship Tips : మీ పార్టనర్ ఇలా చేస్తే మీరు అట్రాక్టివ్ గా కనిపిస్తున్నట్టే

ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత ఆ బంధం మసకబారుతుంది. అంటే నెమ్మదిగా రొటీన్ గా మారిపోతుంది. రిలేషన్షిప్ మొదట్లో ఉన్నంత ఎక్సైటింగ్, ఆసక్తిగా ఉండదు. ఎక్కువ కాలం రిలేషన్షిప్ లో ఉంటే అట్రాక్షన్ తగ్గిపోవడం కూడా మామూలే. మరి ఇప్పటికీ మీ పార్టనర్ కి మీరు ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది? అని ఆలోచిస్తున్నట్టయితే ఈ టిప్స్ మీకోసమే.

1. తను మిమ్మల్ని చూడటం లేదని భావించినప్పుడు మీ పార్ట్నర్ పై చిరాకు పడతారు. అలాంటి సమయంలోనే మీ భాగస్వామి నుంచి సుదీర్ఘమైన, మెచ్చుకోదగిన చూపు మీపై పడితే వాళ్ళు మీ పట్ల పూర్తిగా ఆసక్తిని కలిగి ఉన్నారని అర్థం.

2. మీ పార్ట్నర్ మిమ్మల్ని తాకడానికి మీ జుట్టును సరి చేయడం, మీ కాలర్ ని సర్దడం వంటి సాకులను వెతుకుతారు. అంతేకాకుండా మిమ్మల్ని కౌగిలించుకోవడం, ఆత్మీయంగా మీ చేతులు పట్టుకోవడం లేదా మరేదైనా సంకేతం ఇస్తే వారు మీ పట్ల శారీరకంగా ఆకర్షితులు అవుతున్నారనే దానికి మంచి సంకేతం.

- Advertisement -

3. మీరు సాధారణంగా తయారైనప్పటికీ అందంగా ఉన్నారు అంటూ అభినందిస్తారు. పొగడ్తలు అనేవి రిలేషన్ షిప్ లో పాజిటివిటీని పెంచుతాయి. అలా మీరు చక్కగా తయారైనప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ మీ పార్టనర్ మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం.

4. సరదాగా ఆట పట్టిస్తూ మీ పార్ట్నర్ మీతో సరసాలు ఆడుతుంటే మీరు సరదాగా సంతోషంగా ఉండడం వాళ్లకు ఆనందం కలిగిస్తుందని అర్థం. దురదృష్టవశాత్తు ఎక్కువ కాలం రిలేషన్ లో ఉన్న వారి మధ్య ఈ ఉల్లాసం అనేది తగ్గిపోతుంది. ఒకరికి ఒకరు బాగా అలవాటు పడిపోవడం వల్ల ఇలాంటి వాటికి దూరమవుతారు. కానీ ఇప్పటికీ కొన్ని సమయాల్లో మీ భాగస్వామి మీతో సరదాగా ఉంటే ఇప్పటికీ మీరు వాళ్ళని ఆకర్షిస్తున్నారని అర్థం.

5. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ భాగస్వామికి మీపై ఆకర్షణ తగ్గలేదు అని అర్థం. ప్రత్యేకించి తమ స్నేహితులు, అభిరుచి వంటి వాటిని పక్కనపెట్టి మీతో ఎక్కువ సమయం గడపడాన్ని ఆనందిస్తున్నారు అంటే అది మంచి సంకేతం.

6. అలాగే సాధారణ సందర్భాలలో కూడా మీ భాగస్వామి మీకు మంచిగా కనిపించడానికి ప్రయత్నించినా, వాళ్లు మిమ్మల్ని చూస్తున్నప్పుడు కళ్ళలో ఒక స్పార్క్ ను మీరు గమనించినా, ఊహించని సమయాల్లో ఆప్యాయతతో కూడిన సందేశాలను పంపుతున్నారు అంటే మీ పార్టనర్ కి మీరు ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు అని అర్థం చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు