Relationship Tips: ఆన్లైన్ లో లైఫ్ పార్టనర్ ను వెతుకుతున్నారా? మోసపోవద్దు అంటే ఇలా చేయండి

Relationship Tips : ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఆన్లైన్ డేటింగ్ లేదా మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కోవడం అనేది సర్వసాధారణంగా మారింది. ఇక అమ్మాయిలు, అబ్బాయిలైతే డేటింగ్ యాప్ ల ద్వారా సోల్ మేట్ ను కనుక్కోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మరోవైపు పెద్ద వాళ్ళు సైతం తమ పిల్లల కోసం నచ్చిన వరుడిని లేదా వరుడిని వెతకడం కోసం మ్యాట్రిమోనీ సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదొక అద్భుతమైన అవకాశమే అయినప్పటికీ ఈ ఆన్లైన్ కారణంగా కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి.

చాలామంది మోసగాళ్లు జనాలను మోసం చేయడానికి ఇలాంటి సైట్లను ఉపయోగిస్తారు. వార్తల్లో తరచుగా ఇలాంటి మోసాలు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి ఆన్లైన్లో జీవిత భాగస్వామిని వెతుక్కునే పనిలో పడితే మీరు కూడా అలా మోసపోకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓపిక ముఖ్యం

మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఓపిక ముఖ్యం. ఈ ఆన్లైన్ డేటింగ్ లేదా మ్యాట్రిమోనియల్ సైట్స్ లో చూసి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఏ ప్రొఫైల్ ను కూడా వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. ముందుగా ఆ వ్యక్తిని బాగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎంత వరకు నిజమైన వ్యక్తులు, ఊరు, పేరు, బ్యాక్గ్రౌండ్ వ్ వంటివి తెలుసుకుని, వాళ్లపై పూర్తిగా నమ్మకం కలిగాకే ప్రొసీడ్ అవ్వండి.

- Advertisement -

2. డీటెయిల్స్ ఇవ్వద్దు

ఒకవేళ మీకు ఏదైనా ప్రొఫైల్ నచ్చితే వాళ్లు అడిగిన సమాచారాన్ని అస్సలు ఇవ్వొద్దు. ముఖ్యంగా మీ ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తితో పంచుకోవద్దు. మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్ లలో పొరపాటున కూడా ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వొద్దు.

3. పర్సన్ ఒరిజినలా కాదా చెక్ చేయండి

ఇక ఎవరైనా ఒక వ్యక్తి ప్రొఫైల్ మీకు నచ్చితే వెంటనే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేయండి. దీనివల్ల మీరు మాట్లాడుతున్న వ్యక్తి నిజమైన గుర్తింపు, వాళ్ళ లైఫ్ స్టైల్, ఫ్రెండ్స్, సర్కిల్ గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

4. వీడియో కాల్ మస్ట్

ఇక నచ్చిన వ్యక్తితో కేవలం చాటింగ్ చేసి చాలు అనిపింకూడదు అని గుర్తు పెట్టుకోండి. వీడియో కాల్ చేసి ఆ వ్యక్తితో మాట్లాడండి. అప్పుడే అతని నిజమైన గుర్తింపు, ఉద్దేశం గురించి ఒక ఆలోచనకు రాగలుగుతారు.

5. ఒంటరిగా కలవొద్దు

ఆన్లైన్ లో మీకు తెలిసిన వారిని కలవడానికి ముందు మెంటల్ గా పూర్తిగా రెడీ అవ్వండి. ఎవరినైనా తెలియని వ్యక్తిని మొదటిసారి కలుస్తున్నప్పుడు పబ్లిక్ ప్లేస్ లో కలవడం బెటర్. అలాగే మీకు దగ్గరగా ఉన్న వారిని మీతో పాటే తీసుకెళ్లండి.

6. కంట్రోల్ లో ఉండండి

ఆన్లైన్ లో చాట్ చేస్తున్నప్పుడు మీ ఎమోషన్స్ ను కంట్రోల్ లో పెట్టుకోండి. అవతలి వ్యక్తి మధురంగా మాట్లాడితే, ఆ మాటలకు పడిపోయి నిర్ణయం తీసుకోవద్దు. ఈ టిప్స్ ఫాలో అయితే ఆన్లైన్ లో మోసాలకు గురి కాకుండా ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు