Game Changer : గేమ్ ఛేంజర్ కు రెండు రిలీజ్ డేట్లు… అంతా రజినీ చేతుల్లోనే?

Game Changer : గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు ఇంకా తెర పడలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి రెండు రిలీజ్ డేట్ లు అందుబాటులో ఉండగా, అదికూడా సూపర్ స్టార్ రజనీకాంత్ చేతిలోనే ఉందనే టాక్ మొదలైంది. మరి ఇంతకీ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుంది? అని టాపిక్ లోకి వెళ్తే…

చెర్రీకి తప్పని ఇబ్బంది

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ అప్డేట్స్ గురించి మెగా అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి చూసి విసిగి వేసారి పోయారు. కానీ శంకర్ మాత్రం తన మౌనాన్ని వీడట్లేదు. అయితే ఇటు రాంచరణ్, అటు దిల్ రాజుకు ఎక్కడ చూసినా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనే రామ్ చరణ్ రీసెంట్ గా డాక్టరేట్ అందుకుంటున్న సమయంలో అక్టోబర్ లేదా సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేశారు. అంటే ఆయనకు ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ పై పూర్తిగా క్లారిటీ లేదు.

ఇక ఇది చాలదన్నట్టు రామ్ చరణ్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా రజనీకాంత్ కొత్త మూవీ కూడా అదే స్లాట్ కోసం పోటీపడుతోంది. వెట్టాయన్ మూవీ కూడా అక్టోబర్ లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అక్టోబర్ 10న దేవర మూవీ కర్చీఫ్ వేసింది. ఈ నేపథ్యంలోనే మరో రెండు పాన్ ఇండియా సినిమాలైన వెట్టాయన్, గేమ్ ఛేంజర్ కూడా అదే నెలలో రాబోతున్నాయి. కానీ అక్టోబర్ 10న కాకుండా మిగతా డేట్లలో రావాలంటే ఒకే ఒక్క మూవీకి అవకాశం ఉంటుంది.

- Advertisement -

రజినికాంత్ చేతుల్లోనే…

గేమ్ ఛేంజర్ మూవీ ముందు రెండు డేట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి దీపావళి మరొకటి క్రిస్మస్ 2024. రజినీకాంత్ మూవీ అక్టోబర్ లో రిలీజ్ కావడం ఫిక్స్. ఈ ఏడాది దీపావళి అక్టోబర్లో రాబోతోంది కాబట్టి రజనీకాంత్ మూవీ దీపావళికి షెడ్యూల్ అయినట్టే. కానీ గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే వెట్టాయన్ రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్థే గేమ్ ఛేంజర్ విడుదల తేదీ గురించి ఓ నిర్ణయానికి రావొచ్చు శంకర్ అనే టాక్ నడుస్తోంది. రజనీకాంత్ తో క్లాష్ కాకుండా చూసుకోవాలంటే ఈ మూవీని సెప్టెంబర్ లేదా డిసెంబర్లో రీ షెడ్యూల్ చేయాల్సిందే. అయితే మూవీ రిలీజ్ డేట్ ను ఖరారు చేయాలంటే ముందు షూటింగ్ పూర్తవ్వాలి కదా. కానీ ఇంకా గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ మూవీ రిలీజ్ డేట్ తుది నిర్ణయం శంకర్ చేతుల్లోనే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు