Sreeleela and Raashi Khanna : శ్రీలీల ప్లేస్ కొట్టేసిన రాశి ఖన్నా… తప్పెవరిది?

Sreeleela and Raashi Khanna : టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన శ్రీలీల కెరీర్ కు వరుస ప్లాప్ లతో స్పీడ్ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక గుంటూరు కారం తర్వాత ఈ బ్యూటీ ఒప్పుకున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. తాజాగా ఓ సినిమాలో శ్రీలీల ప్లేస్ ను రాశి ఖన్నా రీప్లేస్ చేసిందంటూ టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి శ్రీలీల ఏ మూవీ నుంచి తప్పుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే…

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైనా రవితేజ, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది శ్రీలీల. అలా నిన్న మొన్నటిదాకా ఫుల్ జోష్ తో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేక చదువుపై కాన్సన్ట్రేషన్ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలీల చేతిలో నుంచి మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ చేజారింది. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీల బదులుగా రాశి ఖన్నాను మేకర్స్ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాబిన్ హుడ్ నుంచి అవుట్

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ రాబిన్ హుడ్ మూవీలో ముందుగా రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీలీల కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలో రాశి ఖన్నాను మేకర్స్ ఫైనల్ చేశారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కానీ రాబిన్ హుడ్ టీం ఇప్పటి వరకు ఈ రూమర్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. కాగా శ్రీలీల, నితిన్ రీసెంట్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ డిజాస్టర్ గా మారడంతో మళ్లీ వీళ్ళిద్దరి కాంబో పట్టాలెక్కుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే ఆ అనుమానాలను తీర్చడం కోసమే అన్నట్టుగా శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందనే వార్త బయటకు వచ్చింది. ఇక ఇప్పటిదాకా శ్రీ లీల రెండు మూడు సినిమాల నుంచి ఇలాగే తప్పుకుంది.

- Advertisement -

శ్రీలీల తప్పుకున్న సినిమాలు

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ సడన్ గా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజును తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ నుంచి శ్రీలీల తప్పుకుంది. అంతకంటే ముందే మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చినా శ్రీలీల నో చెప్పేసిందని రూమర్లు నడిచాయి. టిల్లు స్క్వేర్ కూడా శ్రీలీల వదులుకున్న సినిమాల లిస్ట్ లో ఉంది. కాగా ప్రస్తుతానికి శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ మూవీలోనైనా శ్రీలీల హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందా లేదంటే తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంటుందా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు