Prashant Neel: రూ.20 కోట్లు నష్టపోయిన ప్రశాంత్ నీల్.. అసలేమైందంటే..?

Prashant Neel.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అంతకంతకు తన రేంజ్ ను పెంచుకుంటూ.. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా పేరు సంపాదించుకున్నారు.. ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా కోసం తన ఆస్తులను కూడా అమ్మి మరీ నిర్మించడం గమనార్హం..

Prashant Neel:Prashant Neel who lost Rs. 20 crores.. What happened?
Prashant Neel:Prashant Neel who lost Rs. 20 crores.. What happened?

మొదటి సినిమాతోనే ఆస్తులు అమ్మిన డైరెక్టర్..

ప్రశాంత్ నీల్ ఈ ఉగ్రం సినిమా కోసం ఏకంగా తన ఆస్తులను అమ్ముకున్నారట.. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత శాటిలైట్ హక్కులు అమ్ముడవకుండానే అప్పట్లో కేబుల్ టీవీలో ప్రసారమైందని సమాచారం.. ఉగ్రం పైరసీ వెర్షన్ లో అప్పట్లో బుల్లితెరపై ప్రసారం చేయడంతో ప్రశాంత్ నీల్ కు ఏకంగా రూ.20 కోట్లు నష్టం వచ్చిందని సమాచారం.. కెరియర్ తొలినాళ్లల్లో చేసిన పొరపాటు వల్ల ఆస్తులు అమ్ముకున్నారు కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ .100 కోట్ల రేంజ్ లో పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగారు.. ప్రస్తుతం సాలార్ స్క్రిప్ట్ పనులు బిజీగా ఉన్నారు..

సలార్ -2 పై భారీ అంచనాలు..

కేజీఎఫ్ సినిమాలతో తన హవా మొదలుపెట్టిన ఈయన ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. కానీ కేజీఎఫ్ 2 రేంజ్ లో ఈ సినిమా హిట్ కాలేదు. ఇక భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం మూవీ కి భారీ మైనస్ అని అభిమానులు ఫీలవుతున్నారు. అందుకే సలార్ 2 సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇకపోతే ఈ సలార్ 2 సినిమా మే నెలలో మొదలు కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ సెలవులలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమాలో మరికొన్ని కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

- Advertisement -

ప్రభాస్ కెరియర్ లోనే ఒక అద్భుతం..

ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ.. భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సలార్ 2 సినిమాతో తన సినీ కెరియర్ లోనే ఒక అద్భుతం సృష్టించబోతున్నారని ప్రశాంత్ గట్టిగా నమ్ముతున్నారు
. ముఖ్యంగా ఈ సినిమాల్లో ట్విస్ట్ లు రివీల్ చేయడానికి చాలా సమయం పడుతుందని.. ప్రస్తుతం ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక సలార్ 2 సినిమా నాన్ థియేట్రికల్ తోనే బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ప్రభాస్ కెరియర్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ప్రశాంత్ నీల్ సినిమాలు..

ప్రస్తుతం ప్రభాస్ సలార్ -2 తో సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో తన తదుపరిచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాలు పూర్తయిన వెంటనే ప్రశాంత్ ఏ హీరోకి అవకాశం ఇస్తారో చూడాలి. మొత్తానికైతే మొదటి సినిమా కోసం ఆస్తుల అమ్ముకొని రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల పారితోషకం అందుకుంటూ భారీగా వెనకేసుకున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు