Sonia Agarwal: మాజీ భర్తతో సోనియా మళ్ళీ కలవబోతోందా..?

Sonia Agarwal

7/G బృందావన కాలనీ సినిమా తో హీరోయిన్ గా సోనియా అగర్వాల్ మంచి పాపులారిటీ అందుకుంది.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ఈమె నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈమె నటించిన మూడు చిత్రాలకు డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే నటి సోనియా అగర్వాల్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్.. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేక విభేదాల కారణంగా విడిపోయారు.. ఆ తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకునే సమయంలో ఎవరికి వారు బిజీ అయిపోయారు.. కెరియర్ పరంగా బిజీ అయితే అయ్యారు కానీ విడాకుల అనంతరం తమ లైఫ్ లో ఒక్క సక్సెస్ కూడా లేకపోవడం గమనార్హం..

దీంతో కొన్నాళ్లు దర్శకత్వం వైపు వెళ్లకుండా పలు సినిమాలలో నటుడుగా మారిన సెల్వ రాఘవన్.. ఇటీవలె వాటికి పుల్ స్టాప్ పెట్టి మళ్ళీ దర్శకత్వం వైపుగా దృష్టి పెట్టారు. తన కెరీర్ ను సక్సెస్ బాట పట్టించిన 7/G బృందావన కాలనీ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ముందుగా.. ఇంతకుముందు దర్శకత్వం వహించిన పుదుపెట్టై సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే పుదుపెట్టై చిత్రంలో ధనుష్ ,సోనియా అగర్వాల్ ఇద్దరూ కూడా నటించారు. అయితే ఈ జంట సీక్వెల్లో నటిస్తారా లేదా అనే విషయం పై ఇటీవల హీరోయిన్ సోనియా అగర్వాల్ ను ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా అందుకు ఆమె ఆసక్తికరమైన సమాధానాన్ని తెలిపింది.. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. సెల్వరాఘవన్ తో కలిసి పని చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. నటన తన వృత్తి అని..పుదుపెట్టై-2 లో నటించడం తనకు ఇష్టమే అంటూ తెలిపింది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో నటించమని తనని ఎవరు సంప్రదించలేదని చెప్పింది.. అసలు ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారో కూడా తనకి అసలు తెలియదని సోనియా అగర్వాల్ తెలిపారు. ఇకపోతే సోనియా అగర్వాల్ మాటలను బట్టి చూస్తే తన మాజీ భర్త ప్రముఖ దర్శకుడు సెల్వరాగంతో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇలాగైనా సరే వీరిద్దరూ కలిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు