Naveen Chandra: సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర ఏం చేసేవారో తెలుసా..?

Naveen Chandra

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు నవీన్ చంద్ర.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు.. ఇప్పటికీ కూడా పలు రకాల సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే ఉన్నారు నవీన్ చంద్ర. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన దావత్ అనే ప్రోగ్రాం లో పాల్గొన్న నవీన్ చంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూలోనే భాగంగా తాను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.. నవీన్ చంద్ర మాట్లాడుతూ.. తాను బళ్లారిలో ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయిగా జన్మించానని.. డాన్స్ టీచర్ గా పని చేశానని తెలిపారు.. అప్పట్లో ఆర్ క్యూట్ అనే ఒక సోషల్ మీడియా ఉందని .. అందులో తన ఫోటోలు చూసి డైరెక్టర్ హను రాఘవపూడి తనను పిలిచి అందాల రాక్షసి సినిమాలో అవకాశం ఇచ్చారని కూడా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే నవీన్ చంద్ర సినిమాలలోకి రాకముందు ఒక డాన్స్ టీచర్గా పని చేసినట్లు తెలుస్తోంది.

అయితే డాన్స్ టీచర్ గా పని చేసిన నవీన్ చంద్ర ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో ఎక్కడా డాన్స్ చేసినట్లుగా పెద్దగా కనిపించడం లేదు.. మరి రాబోయే రోజుల్లోనైనా ఏదైనా సినిమాలోని పాటలకు డాన్స్ వేస్తారేమో చూడాలి.. తెలుగు ఇండస్ట్రీలో అవకాశం రావడం చాలా కష్టమని.. అయినప్పటికీ తనకు వచ్చిందని.. తాను హీరోగా అవ్వాలనుకోలేదు అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎలాంటి పాత్రలు వచ్చినా సరే నో చెప్పకుండా చేస్తున్నానంటూ తెలిపారు.

- Advertisement -

అందాల రాక్షసి సినిమా కంటే ముందుగా కన్నడ లో రెండు మూడు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించాను అంటూ తెలిపారు నవీన్ చంద్ర. ఎలాంటి పాత్రలోనైనా సరే నవీన్ చంద్ర ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని పాత్రలలో నటించాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. ఇకపోతే నవీన్ చంద్ర ప్రస్తుతం సినిమాలలో హీరోగా కంటే విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే భారీగా మెప్పిస్తున్నారని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు