Naveen Chandra: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో నవీన్ చంద్ర తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో అలరిస్తూనే ఉన్నాడు. నవీన్ చంద్ర కర్ణాటకలోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుంచే డాన్స్, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువగా ఉండడంతో సినిమాలలో ప్రయత్నించాడు. అలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇక నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత చిత్రంలో బాల్ రెడ్డి గా నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక గతేడాది దండుపాళ్యం శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన తగ్గేదేలే సినిమాతో అలరించాడు. అంతేకాదు ఇటీవల త్రిపుర, పరంపర సీజన్ 2, మంత్ ఆఫ్ మధు లో ఇరగదీశాడు. ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC15 లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -

ఇక నవీన్ చంద్ర సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తన అభిమానులకు శుభవార్తని చెప్పాడు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు నవీన్ చంద్ర. తన సతీమణి ఓర్మ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. ” బేబీ మూన్.. నా చేతిలోకి నేను ఎప్పుడు ఎప్పుడు తీసుకొని ముద్దాడుతానా అని ఎదురుచూస్తున్న. పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం” అంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశాడు. ఇది చూసిన పలువురు ప్రముఖులు, నేటిజెన్ల నుంచి నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు