Sunitha: ప్రెగ్నెన్సీ నా జీవితానికి సంబంధించినని కాదు

సింగర్ సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చక్కటి రూపంతో పాటు తీయని గొంతుతో తెలుగు రాష్ట్రాలలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది సునీత. సింగర్ గానే కాకుండా రియాలిటీ షోలో జడ్జిగా చేస్తూ తెలుగు వారికి మరింత దగ్గరయింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమకు సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన సునీత.. గులాబి, ఎగిరే పావురమా వంటి సినిమాలలో పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది.

ఈమె ఇప్పటివరకు దాదాపుగా 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. సునీత టాలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ భాషలలో సుమారు మూడువేల సినిమా పాటలు పాడింది. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలని, తనకి సంబంధించిన విషయాలని షేర్ చేసుకుంటుంది.

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా సునీతపై ఓ రూమర్ వైరల్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. ఆ మధ్య సునీత వారి మామిడి తోటలోని ఓ మామిడి పండు పట్టుకొని “బ్లెస్డ్” అని పోస్ట్ చేస్తే.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ రూమర్ పై తొలిసారిగా సునీత స్పందించింది. ” నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే?. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం. కానీ నాకు, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు