SelvaRaghavan : ధనుష్ తో సినిమా అమ్మకోరిక

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుండి వస్తున్న తాజా చిత్రం నానే వారువేన్. ఈ సినిమాను తెలుగులో నేనే వస్తాను అనే పేరుతో విడుదల చేస్తుండగా, గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ చిత్రం సెల్వ రాఘవన్ రచన, దర్శకత్వంలో వస్తుంది. సెప్టెంబర్ 29 న తెలుగు, తమిళ విడుదల కాబోతుంది. ఇప్పటికే ధనుష్ ను మూడు సార్లు డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా గురించి పలు అభిప్రాయాలను పంచుకున్నారు.

ధనుష్ గారితో ఇప్పటివరకు మూడు సినిమాలు చేసారు. మళ్ళీ పదకొండు సంవత్సరాలు తరువాత నేనే వస్తున్నా చిత్రం రాబోతుంది.?

ధనుష్ తో సినిమా చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈలోపు ధనుష్ హాలీవుడ్ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అయిపోయాడు. ఇప్పటికి మేము ఇంకా బ్రదర్స్ లానే బిహేవ్ చేస్తుంటాం.

- Advertisement -

ధనుష్ గారికి ఈ కథ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?

నేను మాములుగా ధనుష్ కి ఒక ఐడియా మాత్రమే చెప్పాను, మేము ముందు పుదు పెట్టై- 2 చెయ్యాలి అనుకున్నాం. తరువాత మనం వేరే ప్రాజెక్ట్ చెయ్యాలి అనే థాట్ వచ్చింది. ధనుష్ కి ఒక కోరిక ఉండేది ఇద్దరం కలిసి ఒక సినిమా రాయాలని, సో మేము ఫస్ట్ టైం కలిసి రాసాం.

ధనుష్ గారితో రైటర్ గా వర్కింగ్ ఎక్సపీరియన్స్ ఎలా ఉంది.?

ధనుష్ చాలామంచి రైటర్, ఆల్రెడీ ధనుష్ వి.ఐ.పి లాంటి సినిమాలు రాసాడు. ధనుష్ వెరీ సెన్సిటివ్ రైటర్. నేను ఇప్పటివరకు ఎవరితో కలిసి రాయలేదు ఫస్ట్ టైం ధనుష్ కలిసి ఈ సినిమాను రాసాను.

ఈ సినిమా పోస్టర్స్,టీజర్,సాంగ్స్ చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా గురించి ఏమి చెప్తారు?

యువన్ నాకు మూడో బ్రదర్ లాంటివాడు. ఇరవై రెండు సంవత్సరాలుగా నేను యువన్ తో వర్క్ చేస్తున్నా.. ముగ్గురు బ్రదర్స్ కలిసి మళ్ళీ ఈ సినిమాకు పనిచేసాం.

నటుడిగా మీకు ఇది మూడో చిత్రం. దీనిలో మీ రోల్ ఎలా ఉండబోతుంది.?

అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అండి, ఆ పాత్ర చెయ్యాల్సిన ఆర్టిస్ట్ రాలేదు, సో ప్రొడ్యూసర్, ఇంకా ధనుష్ కూడా చెయ్యమంటే నేను చేసేసా,అది ఒక చిన్న రోల్ అంతే. ధనుష్ కోసం ఈ పాత్రను చేసాను.

ధనుష్ గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. దాని గురించి చెప్పండి.?

ధనుష్ రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా ఇది. డిఫరెన్స్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది దీనిలో ఇద్దరిని ఒకేసారి చూడటం. డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ వెరీయేషన్స్ ఉంటాయి. ఒక కేరక్టర్ నుంచి ఇంకో కేరక్టర్ కి ఎలా ట్రాన్స్ఫార్మ అయ్యారని. మీరు ఈ సినిమాలో చూడొచ్చు.

మీవి వందశాతం ఫిలిమ్స్ అన్ని కంటెంట్ ఓరియెంటెడ్ ఉంటాయి, ఇప్పుడు మీరు కంటెంట్ మూవీ కి ను ప్రిఫర్ చేస్తారా.. కమర్షియల్ మూవీ ను ప్రిఫర్ చేస్తారా.?

రెండింటిని ప్రిఫర్ చేస్తా పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. బాగా ఎంటర్టైన్ చేసాయి.రాజమౌళి గారు సినిమాను హద్దులు ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ కాకుండా ఇండియన్ మూవీ అనగల్గుతున్నాం.

ప్రతీ ఫిల్మ్ మేకర్ ఒక సినిమా చెయ్యడానికి ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అవుతారు. అలా ఈ సినిమా చెయ్యడానికి మీకు ఇన్స్పైరేషన్ ఏంటి.?

నేను ధనుష్ కలిసి సినిమా చెయ్యాలని మా అమ్మ కోరిక. మీరద్దరు కలిసి సినిమా చెయ్యండి అని మా అమ్మ చెపినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసాం.

కలై పులి థాను సర్ కి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?

ఆయన బాగా ఎక్సయిట్ అయ్యారు, ధనుష్ డ్యూయల్ రోల్ ను ఎలా చూపిస్తాం, ఇద్దరు డిఫరెంట్ పీపుల్ ను చూసిన ఫీల్ వస్తుంది ఈ సినిమాలో ధనుష్ ను చూస్తుంటే.

చాలా ఏళ్ల తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో ప్రెంజెంట్ చేస్తుంది. దాని గురించి మీ మాటల్లో.?

గీతా ఆర్ట్స్ మా సినిమాను ప్రెజెంట్ చెయ్యడం మా హానర్. గీతా ఆర్ట్స్ మంచి ప్రొడక్షన్ హౌస్. మంచి క్వాలిటీ ఫిలిమ్స్ ను అందిస్తుంది. అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు మంచి కథ ఉంటే చెప్పండి అని. గీతా ఆర్ట్స్ తో వర్క్ చెయ్యడం కూడా ఒక హానర్.

ఆల్ ది బెస్ట్

థాంక్యూ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు