Dhamaka : మాస్ రాజా మాస్ సాంగ్

కరోనా టైమ్ లో ‘క్రాక్’ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. పాండమిక్ లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక అదే స్పీడ్ లో ‘కిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలను ఐదు నెలల గ్యాప్ లోనే విడుదల చేశాడు. అయితే ఈ రెండు సినిమా ఫలితాలు రవితేజను తీవ్రంగా నిరాశపరిచాయి.

ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ‘ధమాకా’ సినిమా పైనే ఉన్నాయి. త్రినాధ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడిగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్రసన్నకుమార్ బెజవాడ కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నాడు.

ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ‘మాస్ రాజా’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాట రవితేజ ఎనర్జీ, సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. బీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, నకాష్ అజీజ్ అలపించాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘జింతాక్’ పాటకు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు