Pawan Kalyan : స‌రికొత్త‌గా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఖుషి సినిమాకు ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్ లో క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసింది. ఈ సినిమా అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఖుషి సినిమా ఇప్పటికీ టీవీలో కూడా టెలికాస్ట్ అవుతున్నా దీనిని చాలా మంది ఇష్టంగా చూస్తుంటారు. దాదాపు 21 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. 

పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో అజిత్ వాలి మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఎస్. జే. సూర్య టాలీవుడ్ కి పరిచయం అవుతూ శ్రీ సూర్య మూవీస్ బ్యాన్ పై అగ్ర నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించిన చిత్రం ఖుషి. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దాదాపు 21 ఏళ్ల కిందట విడుదల చేసిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని 4k Ultra Hd క్వాలిటీతో, డీటీఎస్ డిజిటల్లోకి కన్వర్ట్ చేసి క్యూబ్ లోకి మార్చేందుకు ప్రయత్నించనున్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఖుషి ట్రైలర్ రీ లోడెడ్ పేరుతో స్పెషల్ గా ట్రైలర్స్ కట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 నూతన సంవత్సరం సందర్భంగా ఖుషి మూవీ డిసెంబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజున  ఘరానామొగుడు, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, మహేష్ బాబు పోకిరి, బాల కృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు రీ రిలీజ్ చేసి రికార్డు  సృష్టించిన  విషయం విధితమే. మరీ కొత్త సంవత్సరానికి పవన్ ఖుషి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో వేచి చూడాలి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు