Prabhas : బాలీవుడ్ నుంచే తాత

దర్శకుడిగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన మారుతి పెద్ద స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయనకి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే హోదా వచ్చింది. మారుతీ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు.. స్క్రిప్ట్ వర్క్ తో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ లు పూర్తవగానే దర్శకుడు మారుతి తో షూటింగ్ స్టార్ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

అయితే బాలీవుడ్ సీనియర్ హీరో ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ సినిమా మొత్తం ఓ ఇంటి సెట్ లోనే ఉండబోతుందని టాక్. ఈ మూవీ స్టోరీ తాతా, మనవళ్ళ కథ అంటున్నారు. తాత క్యారెక్టర్ కి ఓ బాలీవుడ్ సీనియర్ నటుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు