Dhanush: అప్డేటెడ్ ఎడిటింగ్ తో వస్తున్న కెప్టెన్ మిల్లర్.. ఎందుకు?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు నాలుగు రిలీజ్ కావడంతో థియేటర్ల సమస్య తో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన డబ్బింగ్ సినిమాలు జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్ గా రిలీజ్ అవుతున్నాయి. అందులో ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా ఒకటి. అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోలీవుడ్ లో పొంగల్ స్పెషల్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ 165 నిమిషాల నిడివి తో ఉంటుంది. అయితే తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి ఎడిటింగ్ చేసి 149 నిమిషాలకు కుదించారు. లేటెస్ట్ గా ఈ విషయాన్నీ కంఫర్మ్ చేస్తూ మేకర్స్ అప్డేటెడ్ పోస్టర్ తో టైమింగ్ తో ఉన్న స్టిల్ ని రిలీజ్ చేసారు.

అయితే తెలుగు లో దాదాపు 15 నిమిషాలకు పైగా ట్రిమ్ చేయడం పై నెటిజనుల రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు తెలుగు నేటివిటీకి తగ్గట్టు లేదు కాబట్టి బోరింగ్ స్క్రీన్ ప్లే అణా టాక్ రాకుండా ట్రిమ్ చేసారని అంటుంటే, మరి కొందరు మాత్రం తెలుగు వాళ్లకి నచ్చని ప్రాంతీయాభిమానం తో కూడిన సీన్లు ఏమైనా ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా కెప్టెన్ మిల్లర్ తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకోగలడో రిపబ్లిక్ డే రోజు తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు