EVV Satyanarayana: ‘ఇవివి’ పరిచయం చేసిన ఇప్పటి టాప్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఒకప్పుడు తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించి బడా స్టార్ హీరోలు సైతం తన సినిమాల కోసం వెయిట్ చేసేలా చేసిన ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ తరం ఆడియన్స్ కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ. ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు మాత్రం ఇప్పటికి అలరిస్తూనే ఉంటాయి. ఒక అప్పుల అప్పారావు, హలో బ్రదర్, కిత కితలు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో ఆడియన్స్ ని అలరించారు.

అయితే ఇవివి తన దర్శకత్వంలోనే చాలా మంది హీరోలను కూడా పరిచయం చేసారు. అయితే ఇవివి పరిచయం చేసిన హీరోల్లో ఒక మంచి స్టార్ అయింది మాత్రం ఒక్క హీరో మాత్రమే. అది కూడా ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన హీరో కావడం విశేషం. ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” మూవీ. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కగా ఓ హిందీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని రియల్ స్టంట్స్ కి అప్పట్లోనే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా ఆడింది. కానీ పవన్ కళ్యాణ్ కి నటుడిగా మంచి పేరు దక్కింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ హీరో అవుతాడని ఇవివి కూడా ఊహించి ఉండడు. అయితే ఇవివి డైరెక్షన్ లో పరిచయమైన హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అయ్యారు. 90స్ లో స్టార్ హీరోయిన్లు అయిన రంభ, మాలాశ్రీ, రచన లాంటి హీరోయిన్లు ఇవివి దర్శకత్వం లో పరిచయమైన వారే.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు