Captain miller: పండగ మిస్ అయ్యారు.. ఇప్పుడొస్తే డౌటే?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఎప్పుడూ లేనంతగా భారీగా సినిమాలు పోటీలో నిలిచాయి. ఒక్క టాలీవుడ్ నుండే ఐదు సినిమాలు పోటీగా నిలవగా, కోలీవుడ్ నుండి మరో మూడు సినిమాలు నిలిచాయి. కానీ ఎన్ని సినిమాలొచ్చినా అక్కడ థియేటర్లు అడ్జస్ట్ అయితేనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలే కాబట్టి, థియేటర్ల సమష్యతో తప్పని సరి అందులో కొన్ని సినిమాలు వాయిదా వేయాల్సి వచ్చింది. అలా తమిళ్ లో లాల్ సలాం, తెలుగులో ఈగల్ వాయిదా పడడం జరిగింది.

అయినా తెలుగు సినిమాలకి థియేటర్ల సమస్య అలాగే ఉండడం వల్ల కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలని తెలుగులో రిలీజ్ చేయకుండా ఆపాల్సి వచ్చింది. అయితే ఇప్పడు ఆ డబ్బింగ్ సినిమాలు తెలుగులో పండగ తర్వాత రిలీజ్ కి రెడీ అయ్యాయి. తమిళ్ లో పొంగల్ కి రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలు ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

అయితే ఈ సినిమాలు అక్కడ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా, బాగానే ఆడుతున్నా కూడా తమిళ్ లో రిలీజ్ అయిన రెండు వారాలకు తెలుగులో రిలీజ్ అవుతుండడంతో బయ్యర్లు ఈ సినిమాల తెలుగు ఫలితాలపై కొంచెం డౌట్ గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ రిలీజ్ అయ్యి అంత భారీ హిట్లు ఏమి కాలేదు. పైగా ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ లని కొందరు పైరసీల ద్వారా చూసినట్టు టాక్. అందువల్ల తెలుగులో ఈ సినిమాలు తమిళ్ లో లాగా హిట్ అవుతాయా అన్న అనుమానం బయ్యర్లకి కలుగుతుంది. అయితే సంక్రాంతి సినిమాల తర్వాత ఈ వారం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కాబట్టి, వచ్చే వారం కూడా ఈ డబ్బింగ్ సినిమాలు తప్ప వేరే సినిమాలు పెద్దగా రిలీజ్ కావట్లేదు కాబట్టి, ఓ మోస్తరు జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు