Matka: మీడియం రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ పై కన్నేసిన మెగా హీరో?

టాలీవుడ్ లో టాప్ హీరోలు, సీనియర్ స్టార్స్ తరువాత ఇండస్ట్రీ లో ఎక్కువ సినిమాలు చేయాలనీ ప్రొడ్యూసర్లు భావించేది మీడియం హీరోలతోనే. ఈ మీడియం రేంజ్ హీరోల్లో నాని టాప్ ప్లేస్ లో ఉండగా, మీడియం రేంజ్ నుండి స్టార్ హీరో రేంజ్ కి నాని వెళ్ళిపోతున్నాడు. కానీ మిగతా యంగ్ హీరోలు మాత్రం మిడ్ స్టార్ హీరో రేంజ్ ని అనుకున్నట్టే అందుకుని మళ్ళీ కిందకి పడిపోతున్నారు. అలాంటి హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ హీరో లాక్ డౌన్ తర్వాత డౌన్ అయ్యాడు.

స్క్రిప్ట్ సెలెక్షన్ల విషయంలో మెగా హీరోల్లో బెస్ట్ అనిపించుకునే ఈ హీరో, టైం బ్యాడ్ అవ్వడం వల్లో లేక మరేదైనా కారణమో తెలీదు గాని ఇప్పుడు వరుణ్ కి ఓ నిఖార్సైన హిట్టు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాస్ట్ ఇయర్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన వరుణ్ ఇప్పుడు మళ్ళీ షూటింగ్లలో బిజీ అయ్యాడు. ఇప్పటికే వరుణ్ నటించిన “ఆపరేషన్ వాలంటైన్” రిలీజ్ కి రెడీ అవుతుండగా, ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్న “మట్కా” సినిమాపై బాగా ఫోకస్ చేస్తున్నాడని సమాచారం.

ఈ సినిమాపై వరుణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. హిట్ సినిమా అంటే అప్పుడప్పుడూ వరుణ్ కి వస్తూనే ఉంది గాని, నిజానికి తన కెరీర్ ని మార్చే ఓ సాలిడ్ సినిమా ఇప్పటివరకు వరుణ్ కి తగల్లేదనే చెప్పాలి. 2019 లో గద్దలకొండ గణేష్ తో సాలిడ్ హిట్ అందుకున్న వరుణ్ ఆ తర్వాత సరైన హిట్ కొట్టలేదు. ఫలితంగా మీడియం రేంజ్ హీరోల్లో చాలా డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడు కరుణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న “మట్కా” సినిమా పాన్ ఇండియా చిత్రం గా రూపొందుతుండగా, ఈ సినిమాతో వరుణ్ మళ్ళీ తన మార్క్ ని చూపించి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ బర్త్ డే రోజు రిలీజ్ అయిన మట్కా స్పెషల్ వీడియో ఆకట్టుకోగా సినిమాని ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు