Matka: అరవ చిన్నోడ్ని మళ్ళీ నమ్మారు..ఈసారైనా నిలబడతాడా?

టాలీవుడ్ లో మెగా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే ఈ హీరో రెండు నెలల కింద లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అందువల్ల తన సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వగా, ఇప్పుడు సెట్స్ లో మళ్ళీ బిజీ అయ్యాడు. ఇక తాను నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ‘మట్కా‘ సినిమాని కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

వరుణ్ తేజ్ 14వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుండగా, ఈ మూవీకి తాజాగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ని తీసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే జివి ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్ డైరెక్టరే అయినప్పటికీ తెలుగులో మాత్రం తన పాగా వేయలేకపోయాడు. ఎప్పుడో 13ఏళ్ళ కిందట డార్లింగ్ సినిమా తప్ప ఇంత వరకు తెలుగులో ఒక్క సక్సెస్ లేదు. అన్నిటికి మించి ఈ ఇయర్ తెలుగులో టైగర్ నాగేశ్వర రావు, ఆది కేశవ సినిమాలకు మ్యూజిక్ అందించగా, రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

అయినా సరే ఇప్పుడు అఫిషియల్ గా ఈ అరవ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు. పైగా తెలుగులో ఎవ్వరూ మ్యూజిక్ డైరెక్టర్ లేనట్టు వేరే ఇండస్ట్రీలకు వెళ్లి మరీ సంగీత దర్శకుల్ని అరువు తెచ్చుకుంటున్నారు. ఇక రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వండి అని, సీనియర్స్ కి కాకపోయినా, అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని మొర పెట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ అరవ కుర్రాడు జివి కనీసం ఈసారైనా తెలుగులో తన ప్రతిభ చూపిస్తాడా? లేదా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు