Saindhav: ఇక్కడ కూడా ఒకేరోజు అవసరమా..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ అయిదు సినిమాల్లో దేనికవే స్పెషల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు కాగా ఆ సినిమాల ప్రమోషన్ల విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. పోస్టర్ల దగ్గరినుండి పాటల దాకా, టీజర్ నుండి ట్రైలర్ దాకా తమ ప్రమోషన్లతో ఆడియన్స్ లో మాంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ ఐదు సినిమాల్లో ఎదో ఒక సినిమా సంక్రాంతి పోటీ నుండి వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాల మేకర్స్ ఒకే రోజు ప్రెస్టీజియస్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుండడం విశేషం. జనవరి 7న విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ గా నిర్వహిస్తుండగా, అదే జనవరి 7 న హైదరాబాద్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరవనున్నారు. ఈ ఈవెంట్ కూడా సాయంత్రం 7 గంటలకు జరగనుంది.

అయితే సినిమాలు ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఈవెంట్స్ కూడా ఒకేరోజు అవసరమా అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేది జనాలు చూడ్డానికే. థియేటర్ టాక్ కంటే ముందే జనాలు అట్రాక్ట్ అయ్యేది ఈ ప్రీ రిలీజ్ హుంగామా చూసే. అలాంటిది ఒకేరోజు రెండు ఈవెంట్లు ప్లాన్ చేస్తే ఆడియన్స్ ఏ ఈవెంట్ ని చూడాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పండగ సినిమాల మేకర్స్ ఎక్కడా తగ్గకుండా తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎంతవరకైనా వెళ్తున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు