Suriya: జాన్వి కపూర్ తో సూర్య రొమాన్స్‌..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అతితక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏకంగా 32 భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా అనంతరం సుధా కుంగర తో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పారట. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఇందులో సూర్య కర్ణుడి పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథని సిద్ధం చేసుకున్నారట. మార్చి నెలలో సినిమా షూటింగ్ ప్రారంభించేలా షెడ్యూల్ ని తయారు చేస్తున్నారట.

ఇందులో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తుంది. మరి బాలీవుడ్ ఎంట్రీ సూర్య కెరీర్ కి ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో బాలీవుడ్ వైపుకే అడుగులు వేస్తున్నారు. అదే బాటలోనే సూర్య కూడా వెళ్తున్నాడు. సూర్యకి బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్ అవ్వాలని సూర్య అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు