S. Shankar: ఎప్పుడో చెప్పిన కాంబినేషన్, ఇప్పుడు తెరపైకి

S. Shankar

17 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడుగా మారాడు శంకర్. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించాయి. శంకర్ తమిళ దర్శకుడు అయినా కూడా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతూ వచ్చింది. తమిళ ప్రేక్షకులు శంకర్ ను ఎంతగా ఆదరిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో శంకర్ ను ఆదరిస్తారు. ఇండియన్ జేమ్స్ కెమెరామెన్ అంటూ శంకర్ ను పిలుస్తారని మన అందరికీ తెలిసిందే.

శంకర్ చేసిన ప్రేమికుడు, భారతీయుడు, బాయ్స్, అపరిచితుడు వంటి ఎన్నో సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఒకప్పుడు శంకర్ తో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోలు వెయిట్ చేస్తూ ఉండేవారు. అలానే శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రోబో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ శంకర్ లాంటి దర్శకుడితో పనిచేయటం తన డ్రీమ్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ డ్రీమ్ ఇప్పటివరకు నెరవేరలేదు.

మెగాస్టార్ తో సినిమా కాకపోయినా కానీ రాంచరణ్ కి ఆ అవకాశం దక్కింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది అని ఇదివరకే వార్తలు వినిపించాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాతో పాటు శంకర్ భారతీయుడు 2 సినిమాను కూడా చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఇకపోతే ఈ ప్రాజెక్ట్స్ తరువాత శంకర్ చేయబోయే తదుపరి చిత్రం పైన మంచి ఆసక్తి నెలకొంది. శంకర్ తన తదుపరి చిత్రాన్ని ఒక బాలీవుడ్ స్టార్ హీరోలతో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో షారుఖ్ ఖాన్, శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా గేమ్ ఛేంజర్ సినిమాతో శంకర్ హిట్టు కొట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలి. రోబో సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన రోబో-2 సినిమా ఆ స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం శంకర్ చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు